తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో కాబోలు...!

ఈ సృష్టిలో ప్రతి మనిషి అందరికంటే ఎక్కువగా ఆరాధించేది తన తల్లిని మాత్రమే, ఆ తర్వాతే ఎవరైనా.తల్లి తర్వాతే తండ్రి, దైవం, గురువు అని పెద్దలు అన్నారు.

 I Think This Is Called Mothers Love, Mothers Love, Mother Elephent, Baby Elephen-TeluguStop.com

ఈ విషయం కేవలం మనుషులకు మాత్రమే అనుకుంటే పొరపాటు, జంతువులు కూడా మొదటగా ప్రేరణ ఇచ్చేది తన తల్లికి మాత్రమే.ప్రపంచంలో ఏదైనా కల్మషం లేనిదంటే అది అమ్మ ప్రేమ మాత్రమే.

ఇలాంటి అమ్మ ప్రేమకు తార్కాణంగా ఓ సంఘటన కేరళ లో చోటుచేసుకుంది.ఓ అడవిలో ఉన్న రోడ్డు పైకి వచ్చిన తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు తో పాటు మరొక ఏనుగు డివైడర్ దాటాల్సిన అవసరం వచ్చింది.

అయితే ఆ డివైడర్ ను దాటేందుకు ఇబ్బంది పడుతున్న పిల్ల ఏనుగు కు తన తల్లి సహాయం చేసింది.ప్రస్తుతం ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇకపోతే ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటు చేసుకుంది. కేరళ – తమిళనాడు సరిహద్దు సమీపంలోని నాడుకనిచురం ప్రాంతంలో మూడు ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి.

వీటిలో రెండు ఏనుగులు సులభంగా దాటగా, మరో పిల్ల ఏనుగు దాట లేకపోయింది.ఆ పిల్ల ఏనుగు పలుమార్లు ప్రయత్నించిన విఫలం కావడంతో పక్కనే ఉన్న తల్లి ఏనుగు తన తొండంతో పిల్లలను పైకి లేపి డివైడర్ ను సులువుగా ఎక్కించింది.

ఇకపోతే ఈ వీడియోను అనీష్ కాటా అనే వ్యక్తి ఉదయం ఏడు గంటల సమయంలో ఆయన సైక్లింగ్ కు వెళ్లగా అక్కడ జరిగిన సంఘటనని పోస్ట్ చేశాడు.అలాగే ఆ వీడియోను కాంగ్రెస్ నేత జయరామ్ రమేష్, అలాగే ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్ ఖాతా ద్వారా రీ పోస్ట్ చేయడంతో అది కాస్త బాగా వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube