ఉద్యోగ సర్వీసు వదులుకొని బహుజనుల కోసం పోరాటం చేయడానికి వచ్చాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశములో ఆయన మాట్లాడుతూ.గడీల పాలన దొరల పాలన కు  , దేశంలో ధనికులకు అండగా బీజేపీ పాలన కు వ్యతిరేకంగా నా 26 సంవత్సరాల ఉద్యోగ సర్వీసు వదులుకొని బహుజనుల కోసం పోరాటం చేయడానికి వచ్చాను.

 I Quit My Job And Came To Fight For The Masses  Rs Praveen Kumar ,  Rs Praveen K-TeluguStop.com

సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ స్పూర్తితో బహుజనుల కోసం బి ఎస్ పి పార్టీ లో చేరాను.మార్చి 6వ తేదీ  నుండి జనగాం జిల్లా  కిలాషాపూర్ 300 రోజుల పాటు ప్రశ్నించడానికి రాజ్యాధికార యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ లో ఆధిపత్య ధనిక వర్గాల వారు ఆస్తులు పెంచుకుంటున్నారు.ఐదు లక్షల మంది రైతులకు మాత్రమే 40 వేల కోట్లు రూపాయలు ఇచ్చి.

55 లక్షల పేద రైతులకు 10వేల కోట్లు రూపాయలు దళిత బంధు ఇస్తున్నారన్నారు.రైతు బంధు పథకం 100% మంది… భూ స్వాములకు లబ్ది కలిగించే భూస్వాముల పథకం.కేవలం20% మంది పేద రైతులకు మాత్రమే ఇస్తున్నారు.ప్రతి నిత్యం ప్రజల మధ్య బీస్పీ పార్టీవెన్నంటి ఉండి ప్రజల సమస్యల పై పోరాటానికి సిద్ధం.

BC, SC ST కులాలకు చెందిన వారిని BSP పార్టీలోకి వెళతారని కావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని మొక్కుబడిగా చేపట్టారు.దళిత బంధు పథకం దేశంలోనే ఏ నియమ నిబంధనలు లేకుండా చేపట్టిన పథకం ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం మాత్రమే అన్నారు.

ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఉద్దేశంతోనే 600 కోట్లు ఇచ్చి పీకే టీం ను పెట్టుకున్నాడు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను చూస్తే రాష్ట్రాన్ని మాఫియా నడిపిస్తుందా.లేక ప్రభుత్వం నడుస్తుందా.8సంవత్సరాల కాలంలో రాష్టంలో సెక్రటేరియట్ కు రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.కేసీఆర్ ముఖ్యమంత్రి గా పని చేసే నైతిక హక్కు లేదు.ప్రజల అభివృద్ధికి మంత్రులు పనిచేయాలి కానీ భూ కబ్జాలకు కాదు.గజ్వేల కు 471కోట్లు ముఖ్యమంత్రి నిధులు ఖర్చు చేస్తే.మా జోగులాంబ గద్వాల జిల్లా లో ఉన్న ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారు.

చిన్నోనిపల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఓ న్యాయం.గజ్వేల్ భూ నిర్వాసితులకు న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు.

రెవెన్యూ వ్యవస్థ ను నిర్వీర్యం చేసి.ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, నాయకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube