సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గత దశాబ్దన్నర కాలం పైగా ఇండస్ట్రీలో అగ్రతారాలుగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సమంత ఒకరు.ఇప్పటికీ ఈమె ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

 I Only Introduced Samantha To The Industry Director Interesting Comments ,shoot-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన ఈమెను తానే ఇండస్ట్రీకి పరిచయం చేశాను అంటూ డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

సంకీర్తన సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన గీతాకృష్ణ పలు సినిమాలకు దర్శకత్వం వహించారు అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన కోకిల సినిమా మినహా మిగిలిన సినిమాలు పెద్దగా గుర్తింపు పొందలేదు.

అయితే ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమాలు చేయకపోయినా ఇంటర్వ్యూల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈ ఇంటర్వ్యూలో సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.

Telugu Geetakrishna, Samantha, Telugu, Tollywood-Movie

తాజాగా నటి సమంత గురించి మాట్లాడుతూ సమంతను తానే ఇండస్ట్రీకి పరిచయం చేశానని ఈ సందర్భంగా గీతాకృష్ణ వెల్లడించారు.ఈయన ఎన్నో కమర్షియల్ యాడ్స్ షూట్ చేశారు.ఈ క్రమంలోనే సమంత మోడలింగ్ చేసేటప్పుడు తనకు తానే యాడ్ చేసే అవకాశం ఇచ్చానని అయితే తన కేవలం పాకెట్ మనీ కోసం యాడ్ చేసిందని తెలిపారు.అయితే సమంతకు అదృష్టం ఎక్కువగా ఉంది అందుకే తాను ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతోంది అంటూ ఈయన సమంత గురించి వెల్లడించారు.

ప్రస్తుతం సమంత గురించి గీతాకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube