నేనెప్పుడూ చెప్పలేదు కానీ హామీదాను చాలా మిస్ అవుతున్న.. ఎమోషనలైన శ్రీరామ్

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి చివరి దశకు చేరుకుంది.19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్ లతో ఫైనల్ కు చేరుకుంది.ఈ మూడు నెలల ప్రయాణం లో ఎన్నో జ్ఞాపకాలను మూట గట్టుకొని తమ ఇళ్లల్లోకి చేరుకున్నారు.

 Bigg Boss 5 Sri Rama Chandra Emotional Comments On Hameeda Details, Bigg Boss 5-TeluguStop.com

ఇక ఇందులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ లు కూడా త్వరలోనే తమ ఇళ్లల్లోకి చేరుకోనున్నారు.

ఇక ఆ ఐదుగురిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అనేది బాగా ఆసక్తిగా మారింది.ప్రేక్షకులు కూడా ఇద్దరి కంటెస్టెంట్ లు షణ్ముఖ్, సన్నీ పేర్లను నెట్టింట్లో బాగా ప్రచారాలు చేస్తున్నారు.

అందులో ఎవరైనా ఒకరు గ్యారెంటీగా టైటిల్ విన్నర్ అవుతారు అని కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి ఈ మూడు నెలల ప్రయాణం లో బిగ్ బాస్ షో ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగింది.

కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, ప్రేమలు, స్నేహాలు, శత్రుత్వాలు ఇలా అన్ని రకాల బంధాలతో మునిగిపోయి ఒక కుటుంబంగా మారిపోయారు.

Telugu Bigg Boss, Hamida, Love, Manas, Shanmukh, Sri Ram Chandea, Sriram, Sunny,

ఇక ఈ షో పూర్తి కావడానికి సమయం దగ్గర పడడంతో మళ్లీ వీరిని బుల్లితెరపై ఒకే చోట చూడలేమని బాధపడుతున్నారు ప్రేక్షకులు.ఇన్ని రోజులు తమకు ఎన్నో ఎంటర్టైన్మెంట్ లు అందించారని అందులో కొందరు కంటెస్టెంట్ లను బాగా మిస్ అవుతున్నామని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు గడిచిన జ్ఞాపకాలను తలచుకోవడానికి సమయాన్ని ఇచ్చారు.

ఇందులో ఐదుగురు కంటెస్టెంట్ లు తాము ఎన్నటికీ మరచిపోలేని కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు.మొదట మానస్. టెడ్డీబేర్ టాస్క్ లో తను, ఆనీ మాస్టర్, సన్నీ గెలిచాక సంతోషంగా హగ్గు ఇచ్చుకున్నాం అంటూ తాము కలిసి ఉన్న ఫోటో ని చూపించాడు.

Telugu Bigg Boss, Hamida, Love, Manas, Shanmukh, Sri Ram Chandea, Sriram, Sunny,

షన్ను తన తల్లి రాసిన లెటర్ కళ్లముందే ముక్కలైందన్న విషయాన్ని పంచుకున్నాడు.సిరి కూడా బ్రిక్స్ ఛాలెంజ్ ను గుర్తుపెట్టుకుంటాను అని ఎందుకంటే ఆ సమయంలో షన్ను తన నిజమైన ఫ్రెండ్ గా నిరూపించాడని తెలిపింది.ఇక శ్రీరామ్ మాట్లాడుతూ.

నేను ఎప్పుడూ చెప్పలేదు కానీ హామీదాను చాలా మిస్ అవుతున్నా అని ఓపెన్ గా చెప్పేసాడు.

ఆమె ఉండుంటే లోన్ రేంజర్ అనే పేరు వచ్చేది కాదని.

ఈ జర్నీలో తనను మిస్ అయ్యాను అని తెలిపాడు.హామీదా ఎలిమినేట్ కాకముందు శ్రీరామ్ తో బాగా క్లోజ్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ప్రతి ఒక్క విషయంలో ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు.

Telugu Bigg Boss, Hamida, Love, Manas, Shanmukh, Sri Ram Chandea, Sriram, Sunny,

తమ తమ పర్సనల్ విషయాలను కూడా బాగా పంచుకున్నారు.చాలామంది వీరిని చూసి వీరిద్దరి మధ్య లో లవ్ నడుస్తుందని కూడా అనుకున్నారు.ఇక తను ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు.

ఒంటరిగా కూడా ఫీల్ అయ్యాడు.మొత్తానికి ఈ రోజు తన గురించి ఓపెన్ కావటంతో హామీదా ఎలా ఫీల్ అయిందో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube