నేనేం నేరం, ఘోరం చేయలేదు... క్షమాపణ చెప్పను  

I Never Apologised To Anyone Says Radha Ravi-ghost,kolayuthir Kaalam,lady Superstar,nayantara,radha Ravi

తమిళంలోనే కాకుండా తెలుగు మరియు మలయాళంలో కూడా స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నయనతార. ఈ అమ్మడిని లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ అభిమానులు ఆరాధిస్తున్నారు. అదే సమయంలో ఆమె ఒక గొప్ప నటి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు..

నేనేం నేరం, ఘోరం చేయలేదు... క్షమాపణ చెప్పను-I Never Apologised To Anyone Says Radha Ravi

ఇలాంటి సమయంలో తమిళ నటుడు, వివాదాస్పద వ్యక్తి రాధా రవి మాత్రం నయనతారను లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ పొగడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో నయనతారను మామూలుగా చూస్తేనే భయపడతాం, అలాంటిది ఆమె దెయ్యంగా కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కదా అంటూ కామెడీ చేశాడు.

నయనతార పై రాధా రవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపాయి. పలువురు తమిళ సినీ ప్రముఖులు మరియు ఇతరులు నయనతారకు మద్దతుగా నిలిచారు.

అసలు రాధారవి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసంగా లేవు అంటూ చెప్పుకొచ్చారు. రాధా రవి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని, ఆడవారు అంటే ఆయనకు చులకన భావం అని, అందుకే నయనతారపై అలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటూ మహిళ సంఘాల వారు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే తాను క్షమాపణలు చెప్పనంటూ రాధా రవి అంటున్నాడు..

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాధా రవి తన వ్యాఖ్యలపై స్పందిస్తూ. నేనేం నేరం, ఘోరం చేయలేదు, నేను క్షమించరాని తప్పు కూడా ఏమీ చేయలేదు.

ఎందుకు నేను క్షమాపణలు చెప్పాలి. అసలు ఎందుకు నేను ఆమెకు క్షమాపణలు చెప్పాలి. ఒక వేళ నా వ్యాఖ్యలు ఆమెను బాధించి ఉంటే నా వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటాను అని చెప్పాను.

అయినా నేను క్షమాపణలు చెప్పాలంటూ కొందరు అడగటం అవివేకంగా ఉందని, నేనం తప్పు చేయను, తప్పు చేసినట్లుగా క్షమాపణలు చెప్పనంటూ క్లారిటీ ఇచ్చాడు.