టాలీవుడ్ లో నిర్లక్ష్యం చేశా.. అందుకే ఈ పరిస్థితి.. లేటుగా రియలైజ్ అయినా శ్రీయ?

I Neglected Tollywood Industry And Realized Late Actress Shreya

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్నిసార్లు సరైన హోదాను అందుకోక ముందుకే గాల్లో ఎన్నో మేడలు కట్టేసుకుంటారు.తాము నటించిన రెండు మూడు సినిమాలకే ఇతర ఇండస్ట్రీలో కూడా అవకాశాల కోసం ఆరాట పడుతుంటారు.

 I Neglected Tollywood Industry And Realized Late Actress Shreya-TeluguStop.com

ఒకవేళ అదృష్టం బాగుండి అక్కడ కూడా అవకాశాలు అందుకొని సక్సెస్ కాలేకపోవడంతో నిరాశ చెంది చివరికి అడుగుపెట్టిన ఇండస్ట్రీనే దిక్కు అనుకొని వస్తారు.

అలా ఇప్పటికి ఎంతో మంది నటీనటులు వచ్చారు.

 I Neglected Tollywood Industry And Realized Late Actress Shreya-టాలీవుడ్ లో నిర్లక్ష్యం చేశా.. అందుకే ఈ పరిస్థితి.. లేటుగా రియలైజ్ అయినా శ్రీయ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పైగా కెరీర్ మొదట్లో అడుగుపెట్టిన ఇండస్ట్రీనే తమకు మంచి హోదాను కూడా కల్పించింది.అలా నటీనటులు తమ కెరీర్ గురించి మాట్లాడుతూ మరింత ఆశ కోసం పొరపాటు చేసామని చెప్పుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

అందులో ఒకరు శ్రీయ కూడా ఉంది.ఆమె కూడా గతంలో ఇటువంటి దారులలో నడిచి తిరిగి మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చేరుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న హాట్ బ్యూటీ శ్రీయ గురించి అందరికీ పరిచయమే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

తన అందంతో, నటనతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.ఇక ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది ఈ హాట్ బ్యూటీ.

Telugu Actress Shreya, Actress Shreya Husband, Heroine, Marriage, Neglected, Realized, Shreya Re Entry, Shriya, Social Media, Star Heroine Shreya, Tollywood, Tollywood Industry-Movie

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి 2001లో ఇష్టం సినిమాతో అడుగు పెట్టింది.ఈ సినిమాలో తనకు కొంత గుర్తింపు రాగా వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్లో కూడా మెప్పించింది.తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించింది.కానీ టాలీవుడ్ లో అందుకున్న గుర్తింపు అక్కడ అందుకోలేకపోయింది.

Telugu Actress Shreya, Actress Shreya Husband, Heroine, Marriage, Neglected, Realized, Shreya Re Entry, Shriya, Social Media, Star Heroine Shreya, Tollywood, Tollywood Industry-Movie

అలా కెరీర్ మొదట్లో తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలలో నటించగా సరైన గుర్తింపు అందుకోకముందుకే ఓవైపు తమిళ మరోవైపు హిందీ సినిమాలలో ఆశలు పెట్టుకొని అక్కడ అడుగు పెట్టింది.కానీ అక్కడ తనకు అంత గుర్తింపు రాకపోగా మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.అలా రీ ఎంట్రీ తో ఓ రేంజ్ లో సక్సెస్ అందుకుంది శ్రీయ.

ఇక ఈ విషయాన్ని తాను గతంలో మీడియా ముందు కూడా తెలిపింది.తాను టాలీవుడ్ ఇండస్ట్రీని నిర్లక్ష్యం చేసి తప్పు చేశానని ఒప్పుకుంది.ఇక మళ్లీ ఇటువంటి పొరపాటు చేయను అంటూ ఇకపై ఎప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది శ్రీయ.

Telugu Actress Shreya, Actress Shreya Husband, Heroine, Marriage, Neglected, Realized, Shreya Re Entry, Shriya, Social Media, Star Heroine Shreya, Tollywood, Tollywood Industry-Movie

అలా ఇండస్ట్రీలో కొనసాగుతూ లేటు వయసులో కూడా వయసుకి తగ్గ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక అందం విషయంలో ఇప్పటికీ అలాగే ఉంది శ్రీయ.పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీకి టచ్ లోనే ఉంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.

#Actress Shreya #Realized #Actress Shreya #Shreya #Shreya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube