Sitara : నేను ఆమెను కలిశాను కానీ ఆమె నన్ను చూడలేదు.. సితార పోస్ట్ వైరల్ ?

I Met Her But She Didnt See Me Viral Sitara Post

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మహేష్ బాబు ముద్దుల కూతురు సితార( Sitara )గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇప్పటివరకు సరైన ఇండస్ట్రీ పరిచయం లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది సితార.

 I Met Her But She Didnt See Me Viral Sitara Post-TeluguStop.com

తన అన్న గౌతమ్( Goutham ) సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు.కానీ తను మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.

తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువగా పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.అతి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీతార తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ తన వైపు మలుపుకుంది.

చిన్నవయసులోనే సోషల్ మీడియాలో తన పేరుమీద ఖాతాలను కూడా సృష్టించుకుంది.ఇక ఆ సోషల్ మీడియా ఖాతాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, తన డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.అంతే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది.తన సోదరుడితో కలిసి బాగా ఆడుకుంటున్న వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన తండ్రితో సినిమా సెట్ కు వెళ్లి అక్కడ జరిగిన విషయాలు కూడా పంచుకుంటుంది.

ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది సితార.తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ట్రిప్స్ అంటూ తెగ సందడి చేస్తూ ఉంటుంది.ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

ఆ మధ్యనే తన తండ్రి నటించిన సర్కారు వారి పాటలో ఒక పాటకు స్టెప్పులేస్తూ వెండితెర పరిచయం కూడా చేసింది.

ఇక సోషల్ మీడియాలో సితార యాక్టివిటీ చూస్తే భవిష్యత్తులో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది.అప్పుడప్పుడు మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ ఫోటోషూట్లు కూడా చేయించుకుంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది సితార.

అందులో తను ట్రిప్ లో ఉన్నట్లు కనిపించింది.

అయితే తను మోనాలిసా ఫోటోతో సెల్ఫీ దిగగా.మొత్తానికి మోనాలిసా ను కలిశాను అంటూ.కానీ ఆమె నన్ను చూడలేక పోయింది అంటూ పంచుకుంది.

దీంతో ఆమె పోస్టు చూసి తన ఫ్యాన్స్ అంతా.చిన్న మోనాలిసా అంటూ సీతారామ ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.

మరి కొంతమంది మోనాలిసా కంటే అందంగా ఉన్నావు కాబట్టి అందుకే ఆమె నిన్ను చూడలేకపోయింది అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

ఇక సితార భవిష్యత్తులో తండ్రి హోదాతో హీరోయిన్ గా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube