పవర్ స్టార్ సినిమాలు ఇష్టం.. కానీ అస్సలు రీమేక్ చెయ్యను.. అల్లు శిరీష్

శిరీష్కె.రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవం చిత్రంతో సినీరంగప్రవేశం చేసి, గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా కూడా ఇతను ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు అల్లు శిరీష్.

 Allu Sirish Sensational Comments About Pawan Kalyan, Pawan Kayan, Allu Sirish, A-TeluguStop.com

అల్లు శిరీష్ భానుమతి దర్శకత్వం వహించిన తమిళ సీరియల్ లో బాలనటుడుగానూ నటించారు.తన సోదరుడు అల్లు అర్జున్, రామ్ చరణ్‌ నటనా ప్రభావంతో తెలుగు సినిమారంగంలోకి అరంగేట్రం చేశారు అల్లు శిరీష్.

ఆయనకు అనేక పెద్ద బ్యానర్లో గల చిత్రాలకు అవకాశం కూడా వచ్చింది.కానీ తనికి నటజీవితంపై విశ్వాసం లేకపోవటంతో వాటిని తిరస్కరించారు.

కానీ కొన్ని చిత్రాలను చూసిన తర్వాత ఇతర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆత్మ విశ్వాసం వచ్చి ఆయన హీరోగా నటించడాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు అల్లు శిరీష్.


అల్లు శిరీష్‌పై ఓ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ నిర్వహించగా ఆయన ఇలా సమాధానమిచ్చారు.

తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ అంటే కవితలు రాస్తానని అల్లు శిరీష్ చెప్పారు.తను చేసిన మూవీస్‌లో అంతగా సంతృప్తినివ్వని సినిమా కొత్తజంట అని, కంఫర్ట్‌గా ఫీలయిన కో-ఆర్టిస్ట్‌లలో ముఖ్యంగా లావణ్య చాలా కంఫర్ట్‌గా ఫీలవుతానని ఆయన చెప్పారు.

పవన్ కల్యాణ్ చేసిన మూవీస్‌లో రిమేక్ చేసేంత తనకు లేదన్న శిరీష్, ఆయన చేసిన చిత్రాలలో ఖుషి, తమ్ముడు బాగా నచ్చుతాయని అన్నారు.
 

Telugu Allu Sirish, Allusirish, Pawan Kalyan, Pawan Kayan, Tollywood-Movie

ఇక మెగాస్టార్ సినిమాలలో ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోక సుందరి, అన్నయ్య, హిట్లర్ అని ఆయన చెప్పారు.మహేశ్‌బాబూ- మోస్ట్ హ్యండ్‌సమ్ మ్యాన్, పవన్ కల్యాణ్- ఫర్ ది పీపుల్, ఎన్టీఆర్- మాస్ సూపర్ స్టార్, రామ్ చరణ్- మెగాస్టార్ వారసుడు, అల్లు అర్జున్ – హై ఎనర్జీ, రెడ్‌ బుల్, ప్రభాస్- టాలీవుడ్స్ ఫ్రైడ్ అని రాపిడ్‌ ఫైర్‌లో అంతే ఫాస్ట్‌గా సమాధానమిచ్చారు అల్లు శిరీష్.మెగా ఫ్యామిలో చరణ్, వరుణ్ తనతో అత్యంత సన్నిహితంగా ఉంటారని ఆయన అన్నారు.

అంతేకాకుండా ఎదుటి వ్యక్తిలో తనకు మ్యాన్యుప్లేటింగ్ చేయడమనేది నచ్చదని, ఒకవేళ మల్టీ స్టారర్‌తో చేసే అవకాశం వస్తే తనకు నానితో చేయాలని ఉందని శిరీష్ వెల్లడించారు.మెగాస్టార్‌తో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం కథ కూడా వినకుండా సైన్ చేసి సెట్‌లో చూసుకుంటానని, ఆ అవకాశం దొరకితే చాలు అని ఆయన నవ్వుతూ చెప్పారు.
 

Telugu Allu Sirish, Allusirish, Pawan Kalyan, Pawan Kayan, Tollywood-Movie

అంతేకాకుండా కంటిన్యూగా 3 సినిమాలు ఒకే డైరెక్టర్‌తో చేయాల్సి వస్తే సుకుమార్ లేదా త్రివిక్రమ్‌తో చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఇక ఫుడ్ విషయానికొస్తే తనకు దోశ, చికెన్‌ అంటే చాలా ఇష్టమని ఆయన అన్నారు.ఇక అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న.లవ్ మ్యారేజా ? అరెంజ్‌డా ? అన్న ప్రశ్నకు ఆయన లవ్ మారేజ్‌ అని క్లారిటీ ఇచ్చారు.ఇక క్రికెట్, కబడ్డీ తన ఫెవరేట్ స్పోర్ట్స్ అని ఆయన తెలిపారు.తనకు లవ్‌ అంటే చాలా భయమన్న అల్లు శిరీష్, ఫ్లాప్‌లనుంచి కోలుకోవచ్చు గానీ లవ్ నుంచి కోలుకోవడం కష్టమని ఆయన అన్నారు.

నటించడం కన్నా ప్రొడ్యూసింగ్ చాలా కష్టమన్న శిరీష్, తను ఒకవేళ టీచ్ చేయాల్సిన సందర్భం వస్తే కెమిస్ట్రీ టీచ్ చేస్తానన్నారు.తాను మనీ కంటే రిలేషన్‌షిప్స్‌కే ఎక్కువ వాల్యూ ఇస్తానని ఆయన చెప్పారు.

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంచెం ఫీలయ్యేవాడినని, ప్రస్తుతం లైట్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు.అంతేకాకుండా హార్డ్ వర్క్‌ను నమ్ముకున్నా కానీ.

అది చాలా దెబ్బతీసిందన్న అల్లు శిరీష్, స్మార్ట్‌ వర్క్ బెటర్‌ అని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube