నేను భిక్షాటనకు వెళ్లాలి.. సెలవు ఇప్పించాలంటున్న డిప్యూటీ ఇంజినీర్.. వైరల్!

కొందరు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటారు.చదువుకోని వారు అలా చేశారంటే తెలీక చేస్తున్నాడులే అనుకోవచ్చు.

 I Have To Go Begging Deputy Engineer Who Wants To Give Leave  Viral , Engineer,-TeluguStop.com

కానీ, ఓ డిప్యూటీ ఇంజినీర్ తాను అడుక్కోవడానికి వెళ్ళాలి.కానీ సెలవు కావాలని తన పై అధికారులకు లెటర్ రాశారు.

అది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో తెగ వైరల్ అవుతోంది.వీడెవడండి బాబు ఇలా ఉన్నాడంటూ నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.

అసలు విషయానికొస్తే.మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రాజ్‌కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వశాఖలో డిప్యూటీ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.సాధారణంగా జ్వరం వస్తేనో లేక ఏదైనా ఫంక్షన్ లాంటివి ఉంటే సెలవు కావాలని పై అధికారులను కోరతాం.కానీ ఇతను మాత్రం ‘‘తనకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని.

అందుకోసం భిక్షాటన చేయాలనుకుంటున్నట్టు లెటర్‌లో పేర్కొన్నాడు.అంతటితో ఆగకుండా తనలోని అహాన్ని చెరిపివేసేందుకు మతపరమైన అన్వేషణ చేస్తూ.

ఆత్మశోధన చేయాలనుకుంటున్నట్టు వివరించాడు.ఆ లెటర్ చదవిన ఉన్నతాధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అంతటితో ఆగకుండా, గత జన్మలో నేను, ఎంఐఎం పార్టీ లీడర్ అసదుద్దున్‌ ఓవైసీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ముగ్గురు మంచి స్నేహితులమంటూ రాసుకొచ్చాడు.మహాభారత కాలంలో ఓవైసీ పాండు కుమారుడు నకులుడని, మోహన్‌ భగవత్‌ శకుని మామ అంటూ తెలిపాడు.

ఆదివారం తనకు సెలవు మంజూరు చేస్తే భిక్షాటన చేస్తూ గత జన్మను గుర్తుకు తెచ్చుకుంటానని, అందుకోసం భగవద్గీత చదువుతున్నట్టు రాజ్‌ కుమార్‌ తన లేఖలో వెల్లడించాడు.

దీనిపై స్పందించిన పై పై అధికారి జనపధ్ పంచాయితీ సీఈఓ పరాగ్ పంథి, ‘ప్రియమైన డీఈ .మీరు మీ అహాన్ని చెరిపేయాలనుకుంటున్నారు మంచిదే.మీ లక్ష్యాన్ని సాధించడంలో మా వంతు సహకారం మీకు ఉంటుంది.

మీ అహాన్ని మూలాల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో ముఖ్యం’ అని రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఈ సంభాషణ సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube