నాకు దరిద్రమైన గుణాలు ఉన్నాయ్.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిత్రం, జయం వంటి సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన తేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తేజ అసలు పేరు జాస్తి ధర్మ తేజ.

 Tollywood Director Teja About His Poor Qualities, Tollywood, Director, Teja, Co-TeluguStop.com

ఇతను మద్రాసులో జన్మించారు.తేజ తండ్రి JBK చౌదరి ఒక పారిశ్రామికవేత్తగా ఉండేవారు.

అయితే వ్యాపారాలు తీవ్రమైన నష్టాలు రావడం చేత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తేజ తండ్రి పదేళ్ల వయసులో ఉన్నప్పుడే మరణించారు.తేజ చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో తన అక్కవాళ్ళు ఉద్యోగం చేస్తూ తనని చదివించారు.

అయితే చదువుపై పెద్ద శ్రద్ధ చూపనీ తేజ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.

ఇలా కెరియర్ మొదట్లో సినిమాటోగ్రాఫర్ గా రైటర్ గా పని చేసిన తేజ.చిత్రం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమానే అద్భుతమైన విజయం అందుకోవడంతో కెరియర్లో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.

తేజ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలోనే వివాహం చేసుకున్నారు.ఈయనకు ఇద్దరు అబ్బాయిలు కాగా వీరిలో చిన్నబ్బాయి అనారోగ్య సమస్యలతో నాలుగు సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించి మరణించారు.

ఇలా తన బాబు బాగోగులు చూసుకుంటూ కొంతకాలంపాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

ఇలా తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన తేజ చివరిగా కాజల్ నటించినటువంటి సీత సినిమాకి దర్శకత్వం వహించారు.

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించిన తేజ ఓ సందర్భంలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తన వ్యక్తిత్వం గురించి వెల్లడించారు.

Telugu Abhiram, Chitram, Chitram Sequel, Teja, Teja Poor, Jayam, Ranadaggubati,

సాధారణంగా మనిషి అన్న తర్వాత అతనిలో ఎన్నో గుణాలు ఉండటం సర్వసాధారణం.అదేవిధంగా తేజ కూడా తనలో ఎన్నో దరిద్రమైన గుణాలు ఉన్నాయంటూ తన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా ఒక మనిషి, వారు పెరుగుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొందరిలో కొన్ని లక్షణాలు అలవడుతుంటాయి.

ఈ విధంగా నేను పుట్టినప్పుడు 10 లక్షణాలతో పుట్టానని అందులో 5 మంచి గుణాలు ఉండగా… ఐదు దరిద్రమైన గుణాలు ఉన్నాయంటూ తేజ తెలియజేశారు.ఆ దరిద్రమైన గుణాలలో కోపం మొదటిదని… తీసుకుంటే ఏ విషయాన్ని అయినా ఎంత సీరియస్ గా కోపంగా తీసుకోవాలి గానీ లేదంటే ఆ విషయాన్ని అంతటితో పూర్తిగా వదిలేయాలి అంటూ ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలను తేజ తెలియజేశారు.

Telugu Abhiram, Chitram, Chitram Sequel, Teja, Teja Poor, Jayam, Ranadaggubati,

తేజ దర్శకత్వంలో చివరగా వచ్చినటువంటి చిత్రం సీత.ఈ సినిమా తర్వాత తేజ ఏ విధమైనటువంటి సినిమా ప్రకటనలు వెల్లడించలేదు.అయితే గతంలో ఓ సారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ చిత్రం సినిమాకి సీక్వెల్ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి ప్రకటన లేదు.

కాగా ఈ చిత్రం సీక్వెల్ చిత్రం ద్వారా దగ్గుబాటి రానా తమ్ముడిని ఇండస్ట్రీకి లాంచ్ చేయబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube