Rana Daggubati Pan India movies : నా చిన్నప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలను చూస్తున్నా.. రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా గురించి అందరికీ సుపరిచితమే.ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు.

 I Have Been Watching Pan India Movies Since My Childhood Ranas Interesting Comm-TeluguStop.com

పలు సినిమాలలో హీరోగా విలన్ పాత్రలలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా పాన్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఒకానొక సమయంలో ఇండియన్ ఫిలిమ్స్ అంటే బాలీవుడ్ చిత్రాలు మాత్రమే చెప్పుకునేవారు అయితే ఇప్పుడు పూర్తిగా పరిస్థితిలు మారిపోయాయనీ తెలిపారు.

ఇక ప్రస్తుతం డిజిటల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల ఎంతోమంది వివిధ భాషలలో సినిమాలను చూస్తూ ఆదరిస్తున్నారు.

అయితే కొన్ని సినిమాలను చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.ఇక ప్రస్తుతం ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి.ఇలా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్య సినిమాలకు సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా భారీగా డబ్బు ఖర్చు చేస్తేనే సినిమాకి ప్రచారం వస్తుందనుకుంటే చాలా పొరపాటని ఈయన తెలిపారు.

Telugu Bombay, Mani Ratnam, Rana Daggubati, Ranas, Roja, Satya, Tollywood, Varma

మనం చేసే సినిమాలో సత్తా ఉంటే అన్ని భాషలలో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నో సినిమాలు రుజువు చేశాయని తెలిపారు.ఇక ఇప్పుడు పాన్ ఇండియా అని అంటున్నారు కానీ ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి.నేను చిన్నప్పుడే పాన్ ఇండియా సినిమాలను చూశాను అంటూ ఈయన తెలిపారు.

మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన రోజా బొంబాయి వంటి సినిమాలు తమిళ సినిమాలు అయినప్పటికీ ఇవి తెలుగు హిందీ మలయాళ భాషలలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయని రానా గుర్తు చేశారు.అలాగే రాంగోపాల్ వర్మ సత్య సినిమా కూడా పాన్ ఇండియా సినిమానేనని ఈ సందర్భంగా రానా పాన్ ఇండియా చిత్రాల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube