సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) అవకాశాలు అందుకోవాలన్న తదుపరి మంచి సినిమా అవకాశాలు రావాలన్న కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా కొన్ని సినిమాలలో నటించాల్సి వస్తుంది.అయితే ఆ సినిమాలో ఇష్టం లేకపోయినా నటించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
బహుశా డైరెక్టర్ మంచివారు కావచ్చు లేదా హీరో స్టార్ హీరో కావచ్చు.ఆ సినిమా చేయకపోతే తన కెరియర్ ఇబ్బందులలో పడుతుంది అన్న ఉద్దేశంతో కూడా కొందరు తమకు ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలలో నటిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా అలాంటి సినిమాలో నటించారని తెలుస్తుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తనకు ఒక సినిమాలో నటించడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ సినిమాలో నటించాల్సి వచ్చింది అంటూ సినిమా గురించి చెప్పుకొచ్చారు.అయితే ఈమె సినిమా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.ఇష్టం లేకపోయినా అలాంటి చెత్త సినిమాలో నటించి ఎన్నో ఇబ్బందికరమైన అనుభూతులను ఎదుర్కొన్నానని ప్రియాంక చోప్రా వెల్లడించారు.
ఆ సినిమాలో తాను ఒక బొమ్మల పని చేశానని, గంటల తరబడి వెయిట్ చేయించి చెత్త డైలాగ్స్ నాకు ఇచ్చేవారని ప్రియాంక చోప్రా వెల్లడించారు.నిజానికి నాది అలాంటి పాత్ర అస్సలు కాదు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమాలో నటించాల్సి వచ్చిందని తెలిపారు.

నా సినీ కెరియర్లో ఈ సినిమాని మాత్రం అసలు మర్చిపోలేనని ఈ సినిమా అనుభవం తనకు ఏమాత్రం నచ్చలేదు అంటూ ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తాను నటించిన సినిమా తనకు ఏ మాత్రం నచ్చలేదంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్నాయి.దీంతో నెటిజన్స్ ప్రియాంక చోప్రా మాట్లాడిన ఈ మాటలు ఏ సినిమాని ఉద్దేశించి మాట్లాడారు అంటూ నేటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ సినిమాలకు దూరమైనటువంటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
