నేనెప్పుడూ అలా చేయలేదు : కాజల్ అగర్వాల్

తెలుగు చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్కు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతున్నప్పటికి కూడా స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.

 I Had A Lot Of Trouble In My Career But All Of Them Are Sweet Memories For Me,ka-TeluguStop.com

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైన కాజల్ అగర్వాల్ తన కెరియర్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మీకు అడ్డంకిగా అనిపించిన బలహీనతలు ఏమైనా ఉన్నాయా వాటి వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా అని ప్రశ్నించగా… నేను ఏ విషయాన్ని కూడా నా బలహీనత అనుకోను అంటూ తెలిపింది కాజల్ అగర్వాల్.

సమస్యను చూసి పారిపోవడం భయపడం చేస్తే రోజురోజుకు అది బలహీనతగా మారుతుందని…అందుకే ప్రతి సమస్యను సవాలుగా తీసుకుంటా అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

తాను ఎప్పుడూ చాలెంజింగ్ పాత్రలు ఎంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను అని తెలిపింది ఈ అమ్మడు.

ఛాలెంజింగ్ పాత్రలు చేసినప్పుడే తనని తాను ప్రేక్షకుల ముందుకు కొత్తగా ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని కానీ అవన్నీ తనకు తీపి జ్ఞాపకాలు అంటూ చిలిపి నవ్వు నవ్వేసింది.

కాగా ప్రస్తుతం కాజల్ ఆచార్య, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube