నా చెంప పై గట్టి చెంప దెబ్బ పడింది: ప్రకాష్ రాజ్  

I Got Big Slap On My Cheek: Prakash Raj-cheek,indipendente,mohan,prakash Raj,నరేంద్ర మోడీ,ప్రకాష్ రాజ్

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నటుడు ప్రకాష్ రాజ్ బెంగుళూరు సెంట్రల్ నుంచి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థి గా పీసీ మోహన్ తో పోటీపడి ఓటమి పాలయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవ్వగానే అక్కడకు చేరుకున్న ప్రకాష్ మధ్యలోనే కౌంటింగ్ ప్లేస్ నుంచి వెళ్లిపోయారు..

నా చెంప పై గట్టి చెంప దెబ్బ పడింది: ప్రకాష్ రాజ్ -I Got Big Slap On My Cheek: Prakash Raj

ఓటమి పాలవుతున్నట్లు తెలిసిన వెంటనే ఆయన తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆయన ఓటమి ఖాయమైన తరువాత ట్విట్టర్ ద్వారా స్పందించారు.

గట్టి చెంపదెబ్బ పడింది నా చెంపపై.

ఇకపై నా మార్గంలో తిట్లు, వెటకారాలు, అవమానాలు ఇంకా ఎక్కువైతాయి. కష్టంతో కూడిన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు.

జై హింద్‌. అవమానాలు ఎదురైనా పోరాటం మాత్రం ఆగదు అని స్పష్టం చేశారు.

బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌రాజ్‌కు 25,881 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రిజ్వాన్‌ హర్షద్‌కు 4,96,720 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మోహన్‌కు 5,41,792 ఓట్లు పోలయ్యాయి.