అలా కనిపిస్తే పతివ్రత కాదంటారా... నెటిజెన్లకు హాట్ బ్యూటీ ప్రశ్నలు!

బాలీవుడ్ బ్యూటీ సోనాలి రౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె మోడల్ గా, ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

 I Get Slut Shamed On Social Media If I Put A Very Hot Picture Sonali Raut Sonali-TeluguStop.com

ఈమె కేవలం నటనతోనే కాకుండా తన అందంతో కూడా కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.ద ఎక్సపోజ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ, అదత్ డైరీస్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.

తన బాడీ గురించి బోలెడు కామెంట్లు చేసి మరొకసారి హాట్ టాపిక్ గా మారింది.అందమైన శరీరం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించాలని భయం, సిగ్గుతో దాచుకుంటే ప్రశంసలు పొందలేమని తెలిపింది.

అలాగే నేను హాట్ పిక్చర్స్ పోస్ట్ చేసిన ప్రతి సారి సోషల్ మీడియాలో అవమానాలకు గురవుతున్నాను.పతివ్రతలా ప్రవర్తించాలని అంటారు.

నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు.

మరీ ముఖ్యంగా నా చర్మంపై నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇవి ఏవి నన్ను ప్రభావితం చేయవు.అదృష్టవశాత్తూ సోషల్ మీడియాలో నాకు వచ్చే 90% అనుకూలంగా ఉంటాయి.అలాంటి వారి ప్రేమ మాత్రమే నాకు చాలా ముఖ్యమైనది.

కొంతమంది వ్యక్తులు కావాలనే చేస్తారో, లేక తెలియక చేస్తారో తెలియదు కానీ చాలా అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ ఉంటారు.మీరు పెట్టే ఆ అసభ్యకరమైన సందేశాలు నా విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేయలేవనే విషయం వారికి తెలియదు పాపం అంటూ వివరించింది.

అలాగే ఒక వీడియోని కూడా షేర్ చేయగా అధిక కాస్త వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube