పరమశివుడికి నేనే జన్మనిచ్చానని చెబుతున్న మోడల్

సోఫియా హయత్ … ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.ఒక్కప్పుడు ఫేమస్ మోడల్ లేండి.

 I Gave Birth To Lord Shiva – Sofia Hayat-TeluguStop.com

అదేనండి ఈ మధ్య సన్యాసిగా మారిపోయినట్లు ప్రకటించింది.ఇప్పుడు గుర్తొచ్చిందా? తాజాగా సోఫియా హయత్ ఓ పెద్ద బాంబు పేల్చి వార్తల్లో నిలుస్తోంది.బాంబు అంటే ఇక్కడ అబద్ధమని అర్థం.వింటే మీరే నవ్వుకుంటారు.సాక్షాత్తు పరమశివుడికి తనే జన్మనిచ్చానని చెబుతోంది సోఫియా.

దీన్ని కామెడి అనాలో, పిచ్చి అనాలో, భక్తి అనాలో లేక పైత్యం అనాలో కాని, వింతగా వింతగా మాట్లాడుతోంది.

ఈ మధ్య ఔరంగాబాద్ లోని కైలాష్ టెంపుల్ కి వెళ్ళింది సోఫియా.అక్కడ శివలింగాన్ని దర్శంచుకున్నాక, తన శరీరంలో చాలా మార్పు వచ్చిందట.

శివుడికి జన్మనిచ్చింది తనే అని ఈరోజే తెలిసిందని, అంతటి మహాశక్తి తన శరీరంలోకి రావడంతో చాలా భయం వేసిందని, తాను మానవ జన్మ ఎత్తకముందు ఎలా ఉండేదాన్నో అలానే మారిపోతున్నానని, తనలో ఉన్న శక్తి చాలా గొప్పది, దేవుళ్ళంతా తన దగ్గరికి వస్తున్నారని, తనలో శివుడు, లింగంలో తను చేరిపోయారని, ఏంటో ఏంటో చెప్పుకొచ్చింది సోఫియా.

పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతుందో, లేక నిజంగానే తన శరీరంలో అద్భుతాలు జరుగుతున్నాయో.

నిజమెంటో, అబద్ధమేంటో అనేది ఇటు సోఫియాకి, అటు సాక్షాత్తూ పరమశివుడికే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube