రామ్ చరణ్ లో ఆ విషయం నాకు అస్సలు నచ్చదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు!

I Dont Like That Thing In Ram Charan At All Nagababu Made Interesting Comments , Ram Charan, Nagababu, Birthday Celebration, Birthday , Oscar Award , Chiranjeevi , Rrr

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan ) పుట్టినరోజు( Birthday) సందర్భంగా ఆదివారం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమానికి నాగబాబు ( Nagababu )ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 I Dont Like That Thing In Ram Charan At All Nagababu Made Interesting Comments ,-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మెగా అభిమానులు పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మెగా బ్రదర్స్ నాగబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

మా ఇంట్లో మేము ఐదుగురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్.మా ఐదుగురికి రామ్ చరణ్ మొదటి కొడుకు.తను మా అన్నయ్య కొడుకు అయినప్పటికీ మేమందరం తనని సొంత కొడుకు లాగే భావించాము.

ఇక మాకు చిరంజీవి( Chiranjeevi ) అన్నయ్య ఎలాగనో మా పిల్లలకు, మా చెల్లెల పిల్లలకు కూడా రామ్ చరణ్ అలాగే వారికి ఏదైనా సమస్య వస్తే వెంటనే రామ్ చరణ్ వద్దకు వెళ్లి తన సలహాలు సూచనలు తీసుకుంటారని నాగబాబు తెలిపారు.రామ్ చరణ్ కూడా ఆ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని సూచిస్తూ ఉంటారు.

ఇలా ఏ విషయాన్ని అయిన రామ్ చరణ్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు.ఆ విషయంలో రామ్ చరణ్ ను చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుందని తెలిపారు.అయితే తనలో నాకు నచ్చని ఒక విషయం కూడా ఉంది.ఒకప్పుడు తాను చాలా కోపంగా ఉండేవారు ఎంతో ఆవేశపరుడు.ఈ విషయంలో మాత్రం రామ్ చరణ్ తనకు అసలు నచ్చేవాడు కాదని అయితే ప్రస్తుతం తనలో చాలా మార్పులు వచ్చాయని ఈ సందర్భంగా నాగబాబు వెల్లడించారు.ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు( Oscar Award ) రావడం మనకు ఎంతో గర్వకారణం అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ram Charan, Nagababu, Birthday Celebration, Chiranjeevi - Telugu Chiranjeevi, Nagababu, Ram Charan #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube