అలాంటి సినిమాలు చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు: విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో పెద్ద ఎత్తున పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 I Dont Like Doing Such Films At All Vijay Deverakonda, Vijay Deverakonda, Liger,-TeluguStop.com

ఇకపోతే తాజాగా మీడియా సమావేశంతో మాట్లాడిన ఈయనకు మీడియా మిత్రుల నుంచి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.ముఖ్యంగా విజయ్ దేవరకొండ గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ తాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కనుక తన గురించి ఈ విధమైనటువంటి ట్రోల్స్ రావడం సర్వసాధారణం.నా గురించి ఇలాంటివి రోజు వస్తూ ఉంటాయి అయితే నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోనని సమాధానం చెప్పారు.

ఇక ఇండస్ట్రీలోకి రాకముందు నన్ను మా ఇంట్లో మా ఆంటీ వాళ్ళు, అంకుల్స్,ఫ్రెండ్స్ అందరూ కూడా తనని కామెంట్స్ చేసేవారని అయితే వాటి గురించి తాను పెద్దగా పట్టించుకోనని తెలిపారు.

Telugu Bollywood, Friend, Liger, Tollywood-Movie

ఇక సినిమాల గురించి ఈయన మాట్లాడుతూ తనకు రీమేక్ సినిమాలు చేయడం అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.కేవలం రీమిక్స్ సినిమాలో మాత్రమే కాకుండా తాను చేసే సినిమా మరొక సినిమాకు రిలేటెడ్ గా ఉన్నా కూడా తాను అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడనని ఈ సందర్భంగా ఈయన సినిమాల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక లైగర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్ట్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా కోసం నార్త్ నుంచి సౌత్ వరకు అభిమానులకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube