రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు(Natu Natu song) గాను ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా 95వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలలో భాగంగా మొదటిసారి తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో ఈ వేడుకను ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఆస్కార్ అవార్డు విషయంపై స్పందిస్తూ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కూడా ఈ సినిమా ఆస్కార్ అవార్డు పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు వచ్చిన అనంతరం రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తాను అవార్డులను అసలు నమ్మనంటూ కామెంట్ చేశారు.ఆర్ఆర్ఆర్ కి అవార్డులు వచ్చినా రాకపోయినా.నా దృష్టిలో పెద్దగా డిఫరెన్స్ కనిపించదు.
ఎందుకంటే ఈ సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందో ప్రపంచం మొత్తం చూసేసారు.ఒకవేళ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కనుక రాకపోయి ఉంటే అది ఆస్కార్ వాళ్ళ దురదృష్టం అంటూ వర్మ స్పందించారు.
ఇక గత రెండు రోజుల క్రితం ఆస్కార్ సినిమా ప్రమోషన్ల కోసం 80 కోట్లు ఖర్చు చేశారు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్(Tammareddy Bharadwaj) చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించారు.
ఈ సందర్భంగా వర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ.కొంతమంది ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని చాలామంది కామెంట్స్ చేశారు.నా దృష్టిలో రాజమౌళి గారిని ఆయన సినిమాలను ఇలా కామెంట్ చేశారు అంటే చీమ ఏనుగును కామెంట్ చేసినట్లే.నా దృష్టిలో రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో ఎవరూ ఊహించని బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు.
ఇప్పుడు ఆస్కార్ అనేది.నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కి స్ఫూర్తిగా నిలుస్తుంది అంటూ ఈ సందర్భంగా వర్మ ఆస్కార్ అవార్డు గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.