నన్ను ఆపడానికి ఎవరూ సరిపోరు అంటున్న డైరెక్టర్  

  • సంచలనం తో నిత్యం కాపురం చెయ్యడం రాం గోపాల్ వర్మ కి కొత్తేమీ కాదు. ఇప్పటికే తన ప్రతీ సినిమా సెన్సేషన్ కి మారు పేరుగా రామూ తీస్తూ ఉంటాడు. ప్రస్తుతం విజయవాడ లోని రౌడీ ఇజం మీద మనసు పారేసుకున్న ఈ వివాదాస్పద డైరెక్టర్ వర్మ ‘ వంగవీటి ‘ అనే సినిమా తీసి బెజవాడ రౌడీయిజం తన కెమెరా కళ్ళతో చూపిస్తా అంటున్నాడు. ఈ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూ లో ఈ సినిమాకి సంబంధించి తనకి వస్తున్న బెదిరింపుల గురించి మాట్లాడిన వర్మ తనకి బాధ్యత తెలుగు అనీ సినిమాలు తీయడం తనకి ఒకరి నేర్పించక్కరలేదు అనీ పేర్కొన్నాడు.

  • ‘ వంగవీటి మూవీ తీయద్దని నాకు ఎవరైనా చెబుతున్నారంటే ఇది నాన్సెన్స్ కిందే లెక్క. ఇలాంటి వాళ్లను నేను పట్టించుకోను. అసలు వంగవీటి గురించి నాకు లెక్చర్స్ ఇవ్వడం మానేయమనండి’ అంటూ ఓ రేంజ్ లో కసురుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ” నాకు ఇష్టమైంది నేను చేస్తాను, నాకిష్టమైన సినిమా నేను తీస్తాను , దాన్ని ఆపడానికి ఎవరూ సరిపోరు. అసలు రంగా గురించి నాకంటే తెలిసిన వారు ఎవ్వరూ లేరు ” అన్నాడు వర్మ.