నా పెళ్లి గురించి నాకే తెలీదు.. లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి గురించి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 I Do Not Know About My Wedding Lavanya Tripathi Interesting Comments Lavayana Tr-TeluguStop.com

ఇలా గత ఏడాది చావు కబురు చల్లగా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి ఈ ఏడాది హ్యాపీ బర్త్ డే సినిమాలో నటిస్తోంది.

చావు కబురు చల్లగా సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయలేకపోయిన లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజుల నుంచి ఈమె పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Telugu Chavukaburu, Happy Day, Marrige, Tollywood-Movie

ఇలా వీరి గురించి వస్తున్న ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈమె పెళ్లి విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.పెళ్లి ప్రస్తావన గురించి మాట్లాడటానికి ఇష్టపడని ఈమెను అభిమానులు పదేపదే తన పెళ్లి గురించి అడగడంతో ఈ విషయంపై స్పందించారు.ఈ క్రమంలోనే లావణ్య స్పందిస్తూ కొంతమంది ఎలా చేస్తారో.

నా పెళ్లి గురించి నాకు కూడా తెలియదు అంటూ చెప్పడంతో ఈమె పెళ్లి గురించి వస్తున్న వార్తలకు లావణ్య ఈ విధంగా చెక్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube