రజిని కాంత్, కమల్ హాసన్ ల మీద నాకు నమ్మకం లేదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో ఆర్టిస్ట్ గా విలన్ గా అద్భుతమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఈయన మా అధ్యక్ష ఎన్నికలలో పాల్గొని పరాజయం చెందారు.

 I Dont Believe In Rajnikanth And Kamal Haasan Says Prakash Raj Details,  Rajini-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రజనీకాంత్ కమల్ హాసన్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ… తమిళ రాజకీయాల గురించి చెప్పాలంటే ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు.

కానీ పొలిటికల్ ఇన్నింగ్స్ అనేసరికి ఎవరైనా సరే వాళ్ళతో పని చేసారని వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు కదా అని ఆయన అన్నారు.సిద్ధాంతాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు.

కానీ రజనీకాంత్ కమల్ హాసన్ చేస్తారని మాత్రం తనకు నమ్మకం లేదని అందుకే వాళ్ళకి మద్దతు తెలపలేదని ఆయన స్పష్టం చేశారు.తాను కూడా ఇండిపెండెంట్ గా నిల్చున్నాను అని, ఆ సమయంలో తాను చెప్పిన సిద్ధాంతాలు చెప్పినా అవి ప్రజలకు నచ్చలేదని ఆయన అన్నారు.

కానీ ప్రయత్నం అయితే చేశానని ఆయన తెలిపారు.గెలిచానా ఓడిపోయానా అంటే మాత్రం తాను ఓడిపోలేదు అని, ప్రయత్నం చేయడంలో గెలిచానని ప్రకాష్ రాజ్ వివరించారు.

అలా అని వాళ్ళతో పని చెయ్యడం ఇష్టం లేదని కాదు.అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు నచ్చకపోవడం వల్ల తప్పితే వాళ్ళతో ఎలాంటి వ్యక్తిగత విభేదం లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.

తనకు దేశం ముఖ్యమన్న ఆయన, అంతే కానీ ఇంకో కారణం ఏమీ లేదని ఆయన వివరణ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube