మహేష్ ని మోసం చేసాడంట

1-నేనొక్కడినే .ఈ చిత్రం గురించి చర్చించుకున్నంతగా మరే తెలుగు సినిమా గురించి తెలుగు జనాలు చర్చించుకోలేదేమో.

 I Deceived Mahesh Babu – Sukumar-TeluguStop.com

బాక్సాఫీస్ వద్ద భారి ఫ్లాప్ గా నిలిచినా, హాలివుడ్ రేంజ్ సినిమా అని, తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమా అని అప్పట్లో తెగ హంగామా చేసారు ఈ సినిమా నచ్చినవాళ్ళు.ఇప్పుడు ఆ సినిమా మళ్ళి చర్చలోకి వచ్చింది.

నేను మహేష్ బాబు ని మోసం చేసానని అంటున్నాడు ఆ చిత్ర దర్శకుడు సుకుమార్.

తన కొత్త చిత్రం నాన్నకు ప్రేమతో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సుకుమార్ మహేష్ తనని చాలా నమ్ముతాడని, తన దగ్గర చాలా టాలెంట్ ఉందని భావిస్తాడని, మహేష్ తో పాటు 14 రీల్స్ నిర్మాతలు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని వాడుకోలేకపోయానని, మహేష్ కి పెద్ద ఫ్లాప్ ఇచ్చానని, ఆ రకంగా మోసం చేసానని చెప్పుకొచ్చాడు సుకుమార్.

అక్కడితో ఆగకుండా మరో అవకాశం దొరికితే మహేష్ కి మంచి హిట్ ఇవ్వాలి అనుకున్నట్లు చెప్పాడు సుకుమార్.

మరి మహేష్ మళ్ళి అవకాశామిస్తాడా ? సినిమా రిజల్ట్ పక్కన పెడితే, తనలోని నటుడిని బాగా వాడుకున్న సుకుమార్ ని మళ్ళి మన సూపర్ స్టార్ కనికరిస్తాడా ? కాలం సమాధానం చెప్పుతుందో లేదో తెలియదు కాని నాన్నకు ప్రేమతో ఫలితం మాత్రం ఖచ్చింతంగా సమాధానం చెప్పుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube