ఆ విషయంలో ఆ హీరోలతో పోటీపడలేను.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

I Cant Compare With Those Heroes In That Matter Pawan Kalyan Gave Clarity

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నా మెగా హీరో పవన్ కళ్యాణ్. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టాడు.ఈయన వ్యక్తిగత విషయంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ముక్కుసూటి మనిషిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తిగా కూడా నిలిచాడు.ఇదిలా ఉంటే ఈయన ఓ విషయంలో కొందరి హీరోలతో పోటీ పడలేనని క్లారిటీ ఇచ్చాడు.

 I Cant Compare With Those Heroes In That Matter Pawan Kalyan Gave Clarity-TeluguStop.com

ఇంతకీ అది ఏ విషయంలోనో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో పరిచయమయ్యాడు పవన్.

 I Cant Compare With Those Heroes In That Matter Pawan Kalyan Gave Clarity-ఆ విషయంలో ఆ హీరోలతో పోటీపడలేను.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత గోకులంలో సీత, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలలో నటించాడు.ఇక అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ సినిమాలకు కొన్ని రోజులు దూరంగా ఉండి మొత్తం రాజకీయ బాధ్యతలను చూసుకున్నాడు.

మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్విషయంలోనైనా చాలా ఓపెన్ గా ఉంటాడు.

ఓపెన్ గానే మాట్లాడుతాడు.రాజకీయపరంగా లేదా సినిమా పరంగా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తనకు ఏది అనిపిస్తే అదే చెబుతాడు.

అంతేకానీ లోపల ఓ విషయాన్ని దాచి బయట మరో విషయాన్ని అసలు చెప్పడు.అంతే కాకుండా ఆయన వ్యక్తిగతంగా విషయంలో తన మూడు పెళ్లిళ్ల గురించి కూడా చాలాసార్లు ఓపెన్ కామెంట్స్ చేశాడు.

Telugu Badri, Clarity, Compare, Film Industry, Hero, Komaram Puli Movie, Pawan Kalyan, Pawan Kalyan Dance Steps, Politics, Tollywood, Tollywood Heroes, Vakeels Saab-Movie

అలా పవన్ ప్రతి విషయంలో ఓపెన్ గా ఉండటంతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక పవన్ కు సినిమాలలో నటన పరంగా మంచి క్రేజ్ ఉంది.ఈయన సినిమాలలో డైలాగ్స్ చెప్పే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఈయన ఫైటింగ్ చేసే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.అలా సినిమాలలో డైలాగ్స్ పరంగా, ఫైటింగ్ పరంగా బాగా ఆకట్టుకోగల పవన్విషయంలో పోటీ పడలేని క్లారిటీ ఇచ్చాడు.

Telugu Badri, Clarity, Compare, Film Industry, Hero, Komaram Puli Movie, Pawan Kalyan, Pawan Kalyan Dance Steps, Politics, Tollywood, Tollywood Heroes, Vakeels Saab-Movie

ఇంతకు ఆ విషయం ఏదో కాదు డాన్స్.తనకు డాన్స్ రాదని స్వయంగా తానే ఒప్పుకున్నాడు.నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలను బాగా పరిశీలించినట్లయితే ఆయన డాన్స్ అందులో ఎక్కువగా కనిపించదు.

పైగా ఎక్కువ స్టెప్స్ కూడా ఉండవు.ఇక ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గతంలో తెలిపాడు.

తాను నటించిన కొమరంపులి సినిమా ఆడియో ఫంక్షన్ లో కొన్ని విషయాలు పంచుకోగా అందులో తన డాన్స్ గురించి ఓ విషయం బయట పెట్టాడు.

Telugu Badri, Clarity, Compare, Film Industry, Hero, Komaram Puli Movie, Pawan Kalyan, Pawan Kalyan Dance Steps, Politics, Tollywood, Tollywood Heroes, Vakeels Saab-Movie

ఇంతకు ముందు నటించిన సినిమాలలో హెవీ డాన్స్ లేదని ఈ సినిమాలోనైనా డాన్స్ ఉందా అని ప్రశ్నించడంతో వెంటనే పవన్ మొహమాటం లేకుండా నిజం చెప్పేశాడు.తనకు డాన్స్ గొప్పగా రాదని, పాటలలో బాగా నడవగలను అంటూ.కొన్ని సినిమాలలో కాస్త డ్యాన్సులు చేశానని అనుకుంటున్నానని అన్నాడు.

మిగతా హీరోలు డాన్సులు బాగా చేస్తారు.వారితో కంపేర్ చేస్తే వారిలా డాన్స్ చేయడం రాదని ఏదో స్థాయికి తగ్గట్టుగా డాన్స్ చేస్తూ ఉంటానని క్లారిటీ ఇచ్చాడు.

ఇక పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

#Vakeels Saab #Pawan Kalyan #Badri #Komaram Puli #Compare

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube