రూ.900 డ్రెస్ ను 50 రూపాయలకు కొన్న నిహారిక.. ఏం జరిగిందంటే?

I Bought Rs 900 Dress 50 Rupees Niharika Konidela Says

మెగా డాటర్ నిహారిక గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పెళ్లి తర్వాత కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తూ నిహారిక యాక్టివ్ గా ఉంటున్నారు.

 I Bought Rs 900 Dress 50 Rupees Niharika Konidela Says-TeluguStop.com

మరోవైపు సోషల్ మీడియాలో సైతం నిహారిక ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ ను మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక మాత్రమే కావడం గమనార్హం.

అయితే నిహారిక నటించిన ఒక మనస్సు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.తాజాగా నిహారిక తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

 I Bought Rs 900 Dress 50 Rupees Niharika Konidela Says-రూ.900 డ్రెస్ ను 50 రూపాయలకు కొన్న నిహారిక.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను బేరం బాగా ఆడతానని పదో తరగతిలో ఢిల్లీ ట్రిప్ కు ఖాన్ బజార్ కు వెళ్లిన సమయంలో 900 రూపాయల డ్రెస్ ను కేవలం 50 రూపాయలకే కొన్నానని నిహారిక చెప్పుకొచ్చారు.గంట సమయం బేరం ఆడి డ్రెస్ ధరను తగ్గించుకున్నానని నిహారిక పేర్కొన్నారు.

ప్రస్తుతం నిహారిక ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపును సొంతం చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నారు.సైరా నరసింహారెడ్డి సినిమాలో నిహారిక చిన్న పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

Telugu Rupees, Delhi Trip, Maa, Tollywood, Varun Tej-Movie

పెళ్లి తర్వాత కూడా నిహారిక సినిమాల్లో కొనసాగుతారో లేదో చూడాల్సి ఉంది.కొన్నిరోజుల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ కు సైతం నిహారిక హాజరు కాలేదనే సంగతి తెలిసిందే.

Telugu Rupees, Delhi Trip, Maa, Tollywood, Varun Tej-Movie

నిహారిక నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోయినా ఆమె నటించిన వెబ్ సిరీస్ లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.మెగా ఫ్యామిలీ గౌరవాన్ని పెంచే విధంగా నిహారిక పాత్రల ఎంపిక ఉండటం గమనార్హం.నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.వరుణ్, నిహారిక ఒకే సినిమాలో నటిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

#Varun Tej #Maa #Rupees #Delhi Trip

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube