అరుదైన చిత్రాల్లో ‘మాస్ట్రో’ ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను - హీరో నితిన్

నితిన్‌ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాధున్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది.

 I Believe That ‘maestro’ Stands Out As One Of The Rare Films - Hero Nitin ,-TeluguStop.com

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.

ఈ నెల 17న ఓటీటీలో విడుదల కానుంది.ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

మంగళవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఈ ఈవెంట్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా, నరేష్, మంగ్లీ, కాసర్ల శ్యాం, నిర్మాతలు ఎన్‌.

సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ తదితరులు పాల్గొన్నారు.

తమన్నా మాట్లాడుతూ.

‘అందరికీ నమస్కారం.చాలా రోజుల తరువాత ఇలా మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది.

స్వచ్చమైన ప్రేమ దొరికితే.మనకు రెక్కలు వచ్చినట్టు అనిపిస్తాయి.

నా అభిమానుల వల్లే ఈ స్థాయి వరకు వచ్చాను.అంధాదున్ హిందీ సినిమా.

ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ తమ భాషలో చేయాలని అనుకుంటారు.ఈ ఆఫర్ నాకు వచ్చినప్పుడే చేయాలని ఫిక్స్ అయ్యాను.

నితిన్ ఈ ప్రాజెక్ట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది.నితిన్‌తో మంచి లవ్ స్టోరీ చేస్తాను అని అనుకున్నాను.

కానీ ఇలాంటి సినిమాతో చేయడం ఆనందంగా ఉంది.స్టార్డం ప్రేక్షకులు ఇస్తారు కానీ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం మా చేతుల్లోనే ఉంటుంది.

ఈ అవకాశం ఇచ్చినందుకు గాంధి గారికి థ్యాంక్స్.సెప్టెంబర్ 17న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోంది.

తప్పక చూడండి’ అని అన్నారు.

Telugu Maestrostands, Kasarla Shyam, Mangli, Mastreo, Nabha Natesh, Naresh, Nikh

మంగ్లీ మాట్లాడుతూ.‘మీ అందరికీ నేను సింగర్‌గా తెలుసు.కానీ ఈ చిత్రంతో నటిగా పరిచయం అవుతున్నాను.ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలు, దర్శకుడికి థ్యాంక్స్.నువ్ చేయగలవ్ అని చెప్పి దైర్యం చెప్పి మరి నేను నటించేలా చేశారు.సినిమా అద్బుతంగా ఉండబోతోంది.

మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు.నితిన్ చాలా కూల్.

మంచి పర్సన్.మాతో హీరోలా ప్రవర్తించలేదు.

ఫ్రెండ్‌లా, బ్రదర్‌లా ఉన్నారు.తమన్నాతో రెండు మూడు సీన్లే చేశాను.నభాతో సీన్లు నాకు లేవు.ఈ సినిమాలో నన్ను చూసి మీరంతా ఎంజాయ్ చేస్తారు.ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కాసర్ల శ్యాం మాట్లాడుతూ.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి మేర్లపాక గాంధీతో పరిచయం ఉంది.ఆయనది టిపికల్ శైలి.

ఎంతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్.ఈ సినిమాలో ఓ పాటను రాశాను.

నితిన్ గారితో బొమ్మోలే ఉందిరా పోరి,వాటే బ్యూటీ మంచి మాస్ హిట్ నంబర్స్ ఇచ్చాను.ఆయన కెరీర్‌లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది.నితిన్ ఎంతో మంచి మనిషి.ఆయన నటను వందకు రెండు వందల శాతం ఈ సినిమాతో చూస్తాం.ఈ సినిమా విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రాజ్ కుమార్ ఆకేళ్ల మాట్లాడుతూ.

‘అంధాదున్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే.అలాంటి సినిమాను నితిన్ గారు రీమేక్ చేసేందుకు సిద్దపడ్డాడు అని తెలిసినప్పుడు విజయం సాధించిందని నేను అనుకున్నాను.

ప్రతీ ఒక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది.ఈ చిత్రానికి సరైన దర్శకుడు దొరికారు.

సినిమాలోని ఆత్మను చెడకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించారు.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

నిఖితా రెడ్డి మాట్లాడుతూ.‘మాస్ట్రో సినిమా సెప్టెంబర్ 17న విడుదల కాబోతోంది.అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.దర్శకుడు మేర్లపాక గాంధీ అద్భుతంగా తెరకెక్కించారు’ అని అన్నారు.

Telugu Maestrostands, Kasarla Shyam, Mangli, Mastreo, Nabha Natesh, Naresh, Nikh

మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.‘ఎప్పటి నుంచో నితిన్ భయ్యాతో చేయాలని అనుకున్నాను.కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను.కానీ అంధాదున్ లాంటి ఆర్టిస్టిక్ సినిమాచేశాను.నితిన్ అన్న బాగా చేశారు.తమన్నాను మిల్కీ బ్యూటీ అంటే ఏదోలా ఉంది.

ఇప్పటి నుంచి తమన్నాను గ్రేట్ ఆర్టిస్ట్ అని అంటారు.నభా కూడా అద్భుతంగానటించారు.

సినిమాలో పని చేసినప్పుడు కెమెరామెన్‌లు నాతో విసుగు చెందుతుంటారు.కానీ కెమెరామెన్ యువరాజ్ విసుక్కున్నారో లేదో తెలియదు.

నరేష్ గారికి పెట్టిన విగ్‌తో మంచి మ్యానరిజాన్ని క్రియేట్ చేశారు.మంగ్లీ, జిషు సేన్ గుప్తా, రచ్చ రవి, శ్రీముఖి ఇలా ప్రతీ ఒక్కరూ బాగా నటించారు.

మహతి స్వర స్వాగర్ సంగీతం, నేపథ్యం సంగీతాన్ని అద్భుతంగా ఇచ్చారు.ఆయన ఫోన్ ఎత్తకపోయినా కూడా మంచి ఆల్బమ్ ఇచ్చారు.

సెప్టెంబర్ 17న హాట్ స్టార్‌లో ఈ సినిమా రాబోతోంది.సినిమా చూసి కచ్చితంగా పోలికలు పెడతారు.

తిట్టడానికి అయినా పొగడటానికి అయినా సరే సినిమాను చూడండి’ అని అన్నారు.

నభా నటేష్ మాట్లాడుతూ.

‘అందరికీ నమస్కారం.సెప్టెంబర్ 17న మనం కొత్త సినిమాను ఇస్తున్నాం.

ఫస్ట్ వేవ్‌లో మనం అన్ని సినిమాలను చేసేశాం.సెకండ్ వేవ్‌లో కొత్త సినిమా వస్తోంది.

అంధాదున్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందోఅందరికీ తెలిసిందే.రీమేక్‌లో ఆఫర్ రావడం సంతోషంగా అనిపించింది.

ఈ పాత్రకు సరిపోతాను అని నమ్మినందుకు గాంధీ గారికి థ్యాంక్స్.నితిన్ గారితో నాకు ఇది మొదటి సినిమా.

ఆయన చిత్రాలు నేను ఇంతకు ముందు చూశాను.ఆయన ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుంది.

మన కారెక్టర్ మాత్రమే కాదు.చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించాలనే విషయం నితిన్ గారి దగ్గరి నుంచి నేర్చుకున్నాను.

సినిమా పట్ల ఆయనుకున్న అంకిత భావం వేరే లెవెల్. నరేష్ గారితో నాకు మూడో సినిమా.

కెమెరా మెన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు.ప్రతీ ఒక్క విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు.

ఇంత మంచి సంగీతాన్ని ఇచ్చినందుకు మహతి గారికి థ్యాంక్స్ చెప్పాలి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాల మొహం మీద చిరునవ్వు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఓటీటీలో వస్తున్నాం.

ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి.కచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

నితిన్ మాట్లాడుతూ.‘నా అభిమానులకు ముందుగా సారీ.కోవిడ్ నిబంధనల వల్ల ఫంక్షన్‌ను అంత గ్రాండ్‌గా నిర్వహించలేకపోయాం.హిందీలో అంధాదున్ కల్ట్ సినిమా.

రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు భయం వేసింది.కానీ నటుడిగా నిరూపించుకునేందుకు రిస్క్ తీసుకున్నాం.

దర్శకుడు ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు.ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని అంటారు.మార్పులు చేర్పులు చేస్తే.సోల్ లేదు చెడగొట్టారు అంటారు.కానీ గాంధీ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు.హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత బాగుందని అనుకుంటారు.

మహతి సాగర్ పాటల కంటే ఎక్కువగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.అంత మంచి ఆర్ఆర్‌ను థియేటర్లో చూస్తే బాగుంటుందని నేను, గాంధీ చాలా ఫీలయ్యాం.

కానీ పరిస్థితుల వల్లే ఓటీటీలోకి వస్తున్నాం.డీఓపీ యువరాజ్ పనితనం కూడా బిగ్ స్క్రీన్‌లో చూస్తే బాగుండేది.

ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పని తనం కూడా బాగుంది.కానీ బిగ్ స్క్రీన్‌లో మిస్ అవుతున్నాం.

మళ్లీ మన టీం అంతా కలిసి పని చేద్దాం.ఈ సినిమా కోసం చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకున్నాం.

ఈ సినిమాకు క్యాస్టింగ్ చాలా ముఖ్యం.విలన్ కోసం జిషును తీసుకున్నాం.

టబు పాత్రకు చాలా మందిని అనుకున్నాం.కానీ తమన్నా ఒప్పుకుంటుందా? లేదా? అనుకున్నాం.మంగ్లీ యాక్టింగ్ చూసి సింగరా? యాక్టరా? అని షాక్ అయ్యాను.ఇకపై ఆమె సింగర్‌గా పక్కకెళ్లి.

యాక్టర్‌గా బిజీగా అవుతుంది.అలా ప్రతీ ఒక్క పాత్రకు సరైన నటీనటులు దొరకడం చాలా అరుదు.

అలాంటి అరుదైన చిత్రాల్లో ఈ మాస్ట్రో కూడా ఒకటి అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.ఈ సినిమాను తీసినందుకు నిర్మాతలకు థ్యాంక్స్.

అంతేకాకుండా అందరికీ సమయానుగుణంగా డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్.ఇండస్ట్రీలో నాకు ఫాదర్ లాంటి వారు.

ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు.నా తదుపరి చిత్రంలో కూడా మీరే (నరేష్) నా ఫాదర్.

నేను ఫాదర్, మీరు గ్రాండ్ ఫాదర్ అయ్యే వరకు ఇలానే మన జర్నీ కొనసాగుతుంది.ఈ సినిమా సెప్టెంబర్ 17న హాట్ స్టార్‌లో రాబోతోంది.

సినిమాను చూడండి మీ అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube