పంతొమ్మిదేళ్ల వయసులోనే గర్భవతిని అయ్యాను: లేడీ గాగా

ఒకే చోట పనిచేస్తున్న ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య స్నేహపూర్వక బంధాలు ఏర్పడటం సాధారణం.ఈ క్రమంలో వాళ్ల మధ్య జరిగే సంభాషణలు శ్రుతి మించే అవకాశమూ ఉంటుంది.

 I Became Pregnant At The Age Of Nineteen  Lady Gaga, Lady Gaga ,opens, Up,  Rape-TeluguStop.com

అలాగని శ్రుతి మించిన ప్రతి మాటా వేధింపు కిందకు వస్తుందని చెప్పలేం.షేక్ హ్యాండ్ ఇవ్వడం, భుజం మీద చేయి వేయడం, పలకరింపుగా కౌగిలించుకోవడం, ఆఫీసు బయట టీ, కాఫీ లేదా మద్యం సేవించడం, అవతలి వ్యక్తికి ఇబ్బంది లేనప్పుడు ఇవేవీ తప్పు కాదు.

చాలా మంది వేధించే వ్యక్తి ఆఫీసులో తమకంటే పై స్థాయిలో ఉన్నవాడైతే, వాళ్లపై ఫిర్యాదులు తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు.అందుకే వారు ధైర్యంగా ‘నో’ చెప్పలేకపోతున్నారు.

ఇలా అత్యాచారాలకు గురవుతున్నవారు ఎందరో ఉన్నారు.ఇకపోతే సినిమా ఇండస్ట్రీలలో ఇటువంటివి చాలానే జరుగుతున్నాయి.

తాజాగా ఓ పాపులర్ సింగర్ విషయంలో కూాడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

అమెరికాకు చెందిన పాపులర్ సింగర్ స్టెఫానీ గెర్మానొట్టా.తాజాాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్ చేసింది.19 ఏళ్ల వయసులో తనను ఒక ప్రొడ్యూసర్‌ అత్యాచారం చేశాడని పేర్కొంది.ఆ సమయంలో తాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపింది.గర్భవతి అయ్యి నరకం అనుభవించినట్లు ఓ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో తెలపడం కలకలం రేపింది.తన మ్యూజిక్‌ కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి ఆ ప్రొడ్యూసర్‌ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత గర్భవతి అయ్యానని తెలిశాక ఆ ప్రొడ్యూసర్‌ తనని వదిలేశాడని కంటతడి పెట్టింది.తిరిగి మామూలు మనిషి కావడానికి రెండున్నరేళ్లు పట్టిందని విలపించింది.

శుక్రవారం ఆ డాక్యుమెంటరీ వీడియో రిలీజ్‌ అవ్వడంతో కలకలం రేపింది.గాగా అనబడే ఆ సింగర్ అసలు పేరు స్టెఫానీ గెర్మానొట్టా.

ఆమె పాటలు అంటే అమెరికాలోని చాలా మంది ప్రజలకు ఇష్టం.ఆమె ఇలాంటి అనుభవాన్ని భరించడం తెలిసిన ఆమె అభిమానులు ఖంగుతిన్నారు.

ప్రస్తుతం గాగా అక్కడ హాట్ టాపిక్ అయిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube