బిగ్ బాస్ హౌస్ కు నేనే హీరోయిన్.. హామీదా షాకింగ్ కామెంట్స్?

బిగ్ బాస్ ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ తో 5 వారాలను ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున సాంప్రదాయ పంచెకట్టులో ఎంట్రీ ఇచ్చి నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ ను ప్రారంభించారు.

 I-am The Heroine Of Bigg Boss House Hamida Shocking Comment Bigg Boss 5, Telugu-TeluguStop.com

ఇక నవరాత్రుల స్పెషల్ కావడంతో హౌ సభ్యులు కూడా ఎంతో అందంగా ముస్తాబై ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడుతూ నవరాత్రులలో భాగంగా 9 టాస్క్ లు 9 అవార్డులు అంటూ హౌస్ లో ఉన్న సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశారు.

ఇలా హౌస్ సభ్యులకు వివిధ రకాల టాస్క్ లను ఇస్తూ ఏ టీమ్ గెలిచిందో ఆ టీమ్ లోని సభ్యులకు వారి ఫ్యామిలీ మాట్లాడిన వీడియోలు చూపిస్తూ హౌస్మేట్స్ కు సర్ప్రైస్ చేశారు.అదేవిధంగా బిగ్ బాస్ వేదికపైకి పలువురు సినీ తారలు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరిని సందడి చేశారు.

ఇక నవరాత్రులలో భాగంగానే హౌ సభ్యులతో బతుకమ్మను ఆడిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేశారు.ఇలా తొమ్మిది టాస్క్ లో తొమ్మిది అవార్డులను ఇస్తూ ప్రేక్షకులను సందడి చేసిన నాగార్జున హైపర్ ఆదిను బిగ్ బాస్ వేదికపైకి ఆహ్వానించారు.

Telugu Bigg Boss, Hyper Adhi, Nagarjuna, Telugu Hamida-Movie

హైపర్ ఆది కూడా హౌస్ సభ్యులతో మాట్లాడుతూ తనదైన శైలిలో వారిపై కౌంటర్లు వేశారు.ఇలా ఆదివారం ఎపిసోడ్ మొత్తం ఎంతో సరదాగా సంతోషంగా సాగిన తర్వాత నామినేషన్ లో ఉన్న వారు ఒక్కొక్కరు సేవ్ అవుతుండగా చివరికి హమీద, విశ్వ మిగిలారు.ఇక ఐదవ వారం ఎలిమినేషన్ లో భాగంగా హమీద పై ఎలిమినేషన్ వేటు పడింది.హౌస్ నుంచి 5 వ వారం హమీద ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో హమీద మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో తనకు తానే హీరోయిన్ అని చెప్పుకుంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఇలా 19 మంది కంటెస్టెంట్ లో ప్రారంభమై ఐదు మంది ఎలిమినేట్ కాగా 14 మంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube