దానికి అసలు కారణం నేనే అంటున్న అరవింద్  

I Am Responsible For Allu Arjun Gap Says Allu Aravind - Telugu Ala Vaikuntapuramulo, Allu Aravind, Allu Arjun, Geetha Arts, Telugu Movie News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.త్రివిక్రమ్ మార్క్ కథ ఈ సినిమాకు మేజర్ అసెట్ కాగా, బన్నీ యాక్టింగ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

I Am Responsible For Allu Arjun Gap Says Allu Aravind

ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

అయితే బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో బన్నీ తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు చాలా స్క్రిప్టులు వినాల్సి వచ్చిందని, సినిమా సైన్ చేసినా కూడా సరైన కథ దొరకలేదని అల్లు అరవింద్ తెలిపాడు.తాను త్రివిక్రమ్ కథను ఓకే చేసేందుకు చాలా సమయం తీసుకోవడం కారణంగానే బన్నీ సినిమాకు ఇంత లాంగ్ గ్యాప్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు.

ఏదేమైనా లాంగ్ గ్యాప్ వచ్చినా, తాము అనుకున్న సక్సెస్‌ను మాత్రం అందుకోగలిగాము అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

I Am Responsible For Allu Arjun Gap Says Allu Aravind Related Telugu News,Photos/Pics,Images..

footer-test