సంతోషంగా ఉంది...నేను వీఐపీని కాదు!

మనం ఎవరినైనా ‘నువ్వు వీఐపీవి…వీవీఐపీవి’ అన్నామనుకోండి.అతను ఎంతో సంతోషిస్తాడు.

 I Am No Vip-TeluguStop.com

ఏనుగు ఎక్కినంత సంతోషపడతాడు.వీఐపీ అంటే ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఉంటుంది కదా.కాని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్టు వాద్రా మాత్రం ‘నేను వీఐపీని కాదు.ఆ జాబితా నుంచి నా పేరు తీసేసినందుకు సంతోషంగా ఉంది’ అని అంటున్నాడు.

ఈయన గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి వీవీఐపీగా పరిగణించి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు రక్షణ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.అయితే మోదీ సర్కారు వాద్రాను వీఐపీ లిస్టు నుంచి తీసేసింది.

దీంతో ఎస్‌పిజి రక్షణ కూడా పోయింది.ఈయన పేరు వీఐపీ జాబితాలో ఉండటంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో చెకింగ్‌ నుంచి మినహాయించారు.

ఇప్పుడు వీఐపీ జాబితా నుంచి తీసేశారు కాబట్టి ఇతర ప్రయాణికుల్లాగానే వాద్రాను కూడా అణువణువూ చెక్‌ చేయాలని దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు వెళ్లాయి.తన పేరు వీఐపీ లిస్టు నుంచి తొలగించాలని తాను ఎప్పుడో లిఖితపూర్వకంగా ఇచ్చానని అన్నారు.

వీఐపీ హోదా తనకు ఇబ్బందికరంగా ఉందన్నారు.వాద్రా మీద కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక ప్రాణాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనే ఉద్దేశంతో వారికి ఎస్‌పిజి రక్షణ కల్పించారు.వాస్తవానికి వాద్రా బయటి వ్యక్తి.

ఆయన్ని వీవీఐపీగా చూడాల్సిన అవసరంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube