నీ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం...సమంత పోస్ట్ వైరల్!

I Am Lucky To Have A Friend Like You Samantha Reply To Director Rahul Ravindran Details, Samantha, Director Rahul Ravindran, Russo Brothers, Varun Dhawan, Chinmayi, Samantha Web Series, Citadel, Rahul Ravindran, Singer Chinmayi,

టాలీవుడ్ క్రేజీ యాక్ట్రెస్ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.అలాగే ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

 I Am Lucky To Have A Friend Like You Samantha Reply To Director Rahul Ravindran-TeluguStop.com

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ వెబ్ సిరీస్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో రాజ్ అండ్ డీకే సమంతతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు.

వరుణ్‌ ధావన్ సమంతలు కలిసి సిటాడెల్ అనే స్పై వెబ్ సిరీస్‌ను చేస్తున్నారు.దీన్ని రూసో బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ కోసం గత కొద్దిరోజులుగా సమంత డేట్స్ అడ్జస్ట్ చేస్తూనే వచ్చారు.అయితే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సిరీస్ సమంత మయోసైటీస్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదు.అయితే సమంత ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగ కోలుకోవడంతో ఈమె తిరిగి షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధమైందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రూసో బ్రదర్స్ సమంతకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ పోస్టు పై నటుడు, దర్శకుడు రాహుల్ రవీందర్ స్పందించారు.

ఈ పోస్ట్ పై రాహుల్ రవీందర్ స్పందిస్తూ సమంత క్రేజ్ ఏంటో చూశారా ఏకంగా రూసో బ్రదర్స్ ఆమెకు స్వాగతం పలికారు సమంత మనల్ని తలెత్తుకునేలా చేస్తోంది అంటూ పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ పై సమంత స్పందిస్తూ.నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అంటూ రాహుల్ పోస్ట్ కు రిప్లై ఇచ్చారు.

ఇలా సమంత గురించి రాహుల్ రవీందర్ చేసిన పోస్ట్ పై చిన్మయి స్పందిస్తూ… సమంత క్వీన్ అంతే అంటూ చెప్పుకొచ్చారు.దీంతో సమంత చిన్మయి ట్వీట్ కి స్పందిస్తూ నువ్వే క్వీన్ అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube