నేను అమెరికా వెళ్తున్న.. నా తమ్ముడిని మీరే చూసుకోవాలి.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఒకవైపు నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మరోవైపు నిర్మాతగా బాధ్యతలు స్వీకరించారు.

 I Am Going To America Take Care Of My Brother Says Vijay Devarakonda Details,  V-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆనంద దేవరకొండ హీరోగా నటించిన పుష్పకవిమానం సినిమాకు విజయ్ దేవరకొండ నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నారు.

ఈ సినిమా నవంబర్ 12వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లో ఎంతో ఘనంగా జరిగింది.

ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తాను సినిమాల్లోకి రావాలనుకున్న సమయంలో నిర్మాతలు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడ్డానని అలాంటి ఇబ్బంది మరొకరికి రాకూడదని తాను నిర్మాతగా మారిన విషయాన్ని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలియజేశారు.

Telugu America, Lige, Pre, Tollywood, Vishakapatnam-Movie

అదేవిధంగా పుష్పక విమానం నవంబర్ 12వ తేదీ విడుదల కాబోతుందని ఈ సినిమా విడుదలయ్యే సమయానికి తాను లైగర్ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్తున్నానని, నా తమ్ముడు విజయ్ దేవరకొండను తను నటించిన పుష్పక విమానం చిత్రాన్ని మీరే చూసుకోవాలి అంటూ ప్రేక్షకులను కోరారు.నిర్మాతగా ఒక సినిమాను చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.ఇది చాలా పెద్ద రెస్పాన్సిబులిటీ అంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube