ఇక చాలు అంటున్న కాజల్

అందాల భామ కాజల్ ఎప్పుడు అందాల ఆరబోతకి నో చెప్పలేదు.ఇండస్ట్రీకి వచ్చిన కోత్తల్లో ఏ హీరోయిన్ అయినా తమకి గ్లామరస్ రోల్స్ దక్కాలని, తమ అందాలతో అందరిని ఆకట్టుకోవాలనే అనుకుంటారు.

 I Am Done With Glamorous Roles – Kajal Agarwal-TeluguStop.com

ఇందుకు కాజల్ కుడా మినహాయింపు కాదు.అందుకే మొదటినుంచి బట్టల విషయంలో పొదుపు పాటించింది కాజల్.

సినిమాలే కాకుండా, అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ కుడా బాగానే చేసింది ఈ భామ.

అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు.ఇప్పుడు కాజల్ పెద్ద హీరోయిన్.ఎవర్ని ఇంప్రెస్స్ చేయాల్సిన పని లేదు.అందుకే ఇకనుంచి గ్లామర్ ప్రాధాన్యమున్న సినిమాలు చేయదంటా కాజల్.” నాకు ఈ రోజు మంచి గుర్తింపు ఉంది.నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను.నటిగా మంచి పొజిషన్ కి వచ్చాను.ఇప్పుడు నాకు గ్లామర్ రోల్స్ అవసరం లేదు.నాలో ఉన్న నటిని సంతృప్తి పరుచుకోవాలి.

అందుకే ఇక నుంచి కథాబలం ఉన్న చిత్రాలు, నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేయాలనుకుంటున్నాను ” అంటూ తన మనసులో మాట బయటపెట్టింది కాజల్.

కాజల్ ప్రస్తుతం మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు చేస్తోంది.

ఇవి కాకుండా హిందీలో దో లఫ్జోన్ కి కహాని, తమిళంలో జీవా సరసన కవలై వెండం అనే చిత్రాలు చేస్తోంది ఈ 30 ఏళ్ల నటిమణి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube