దిల్‌రాజు బ్రాండ్‌ వ్యాల్యూ పడిపోతుంది.. జాగ్రత్త పడకుంటే భారీ నష్టం  

టాలీవుడ్‌లో దశాబ్ద కాలంకు పైగా నిర్మాతగా కొనసాగుతూ వస్తున్న దిల్‌రాజుకు ప్రత్యేకమైన బ్రాండ్‌ వ్యాల్యూ అనేది ఏర్పడటం జరిగింది. దిల్‌రాజు ఒక సినిమాను నిర్మించాడు అంటే అందులో హీరో ఎవురు, దర్శకుడు ఎవరు, హీరోయిన్‌ ఎవరు అనే విషయాలను పట్టించుకోకుండా కేవలం దిల్‌రాజు కోసం సినిమాలకు వెళ్లేవారు. కాని ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి. దిల్‌రాజు చేస్తున్న, తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతున్నాయి.

I Am Completely Confused: Producer Dil Raju-

I Am Completely Confused: Producer Dil Raju

నిర్మాతగా కెరీర్‌ ఆరంభించిన కొన్ని సంవత్సరాల పాటు వంద శాతం సక్సెస్‌ రేటుతో దూసుకు పోయిన దిల్‌రాజు ప్రస్తుతం మాత్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈమద్య కాలంలో దిల్‌రాజు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత సంవత్సరం దిల్‌రాజుకు ఎంతటి సంతోషాన్ని మిగిల్చిందో, ఈ సంవత్సరం అంతకు రెట్టింపు దుఖ:ను మిగిల్చింది. ఈ సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేయలేక పోయిన దిల్‌రాజు ఇప్పటి వరకు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రాజ్‌ తరుణ్‌తో నిర్మించిన ‘లవర్‌’ చిత్రంతో పాటు తాజాగా నితిన్‌ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా దిల్‌రాజు బ్యానర్‌ స్థాయిలో లేవు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. దిల్‌రాజు అంటే ఒక మోస్తరు బ్రాండ్‌ ఉంటుంది. కాని ఆ బ్రాండ్‌ వ్యాల్యూను ఈ రెండు సినిమాలు కంటిన్యూ చేయలేక పోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

I Am Completely Confused: Producer Dil Raju-

దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు గతంలో ఎదురు చూసేవారు. కాని ఆ సినిమాలో హీరో ఎవరు, దర్శకత్వం ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే దిల్‌రాజు బ్రాండ్‌ వ్యాల్యూ ఏ రేంజ్‌కు పడిపోయిందో తెలుసుకోవచ్చు. ఇలాగే పరిస్థితి కొనసాగితే మరింత దారుణమైన అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ సినీ వర్గాల వారితో పాటు విశ్లేషకులు కూడా దిల్‌రాజును హెచ్చరిస్తున్నారు. గతంలో మాదిరిగా కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడటంతో పాటు, సినిమా నిర్మాణం సమయంలో అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకు సలహాలు ఇస్తున్నారు.