ఇండస్ట్రీలో బ్రాహ్మిణ్ అమ్మాయిలని అలా అడగరు.. అర్ధపావు భాగ్యం హాట్ కామెంట్స్?

కార్తీకదీపం సీరియల్‌లో అర్ధపావు భాగ్యంగా ఉమాదేవి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని అందరిని అలరించిన విషయం అందరికీ తెలిసిందే.ఇటీవలే బిగ్‌బాస్‌ షోకి వెళ్లిన ఆమె.

 I Am A Brahmin So I Did Not Get The Right Opportunities Says Bigg Boss Umadevi-TeluguStop.com

రెండో వారంలోనే గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశారు.షో స్టార్ట్ చేసిన మొదటిరోజు నుంచీ ఇంటి సభ్యులతో ఏదో ఒక రకంగా గొడవలకు పాల్పడుతూనే ఉన్నారు.

చివరికి హౌజ్‌లో ఉన్న వాళ్లనే కాకుండా.చూస్తున్న ప్రేక్షకులను కూడా తన బూతులతో ఆశ్చర్యపోయే చేశారు ఉమాదేవి.

 I Am A Brahmin So I Did Not Get The Right Opportunities Says Bigg Boss Umadevi-ఇండస్ట్రీలో బ్రాహ్మిణ్ అమ్మాయిలని అలా అడగరు.. అర్ధపావు భాగ్యం హాట్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో విసిగిపోయిన బుల్లితెర అభిమానులు ఆమెను ఇంటి నుంచి పంపేశారు.

ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తన స్టైల్లో ఇంటి సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమాదేవి.

షో నుంచి వచ్చిన నుంచీ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న ఉమాదేవి బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న సభ్యులపైనా, బిగ్‌బాస్‌ పైనా కామెంట్స్ చేసి అందర్నీ షాక్‌కు గురయ్యేలా చేస్తున్నారు.సిరి, షణ్ముఖ్‌లతో పాటుయాంకర్ రవిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉమాదేవి బిగ్ బాస్ విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అయిపోయారని.

యాంకర్ రవికి బిగ్ బాస్ వాళ్లు మొత్తం చెప్పి హౌస్‌లోకి పంపించారని అతన్నే విన్నర్ చేస్తారని చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

గతంలో కూడా ఉమాదేవి టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌పైనా తెర వెనుక జరిగే బాగోతాలపైనా ఓపెన్‌గా మాట్లాడారు.అందులో భాగంగా కులాన్ని ప్రస్తావిస్తూ తాను బ్రాహ్మిణ్ కావడం వల్లే సరైన అవకాశాలు రాలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉమాదేవి.ఈ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని లేవనెత్తుతూ ఇండస్ట్రీలో బ్రాహ్మిణ్ అమ్మాయిని ఎవరూ ఆ పనికి పిలవరు అంటూ ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వ్యాంప్ పాత్రలు చేసినవాళ్లు మంచి టాప్ పొజిషన్‌కి వెళ్లారు కానీ.నాకు వాళ్లకి వచ్చినట్టుగా వ్యాంప్ రోల్స్ రాలేదు.ఐటమ్ సాంగ్స్ కూడా రాలేదు.నాకు డాన్స్ వచ్చినా అవకాశం రాలే’దని ఆమె చెప్పుకొచ్చారు.

ఇలా బ్రాహ్మణ అమ్మాయి అవడం కొంతవరకు ప్లేస్ అయినా మరికొంత కూడా అయింది ఎన్నో అవకాశాలు కోల్పోయానని ఈ సందర్భంగా భాగ్యం వెల్లడించారు.

#Anchor Ravi #Umadevi #Karthika Deepam #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు