అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ట్రంప్: భారతీయ ఐటీ నిపుణులకు ఢోకా లేదంటున్న నిపుణులు

ఇక నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా హెచ్1బీ వీసాదారులకు ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ ఉత్తర్వుల్లో అధ్యక్షుడు స్పష్టం చేశారు.

 Hysea On Trump Executive Order Against Hiring H1b Visa Holders, Hysea , H1b V-TeluguStop.com

అన్ని ప్రభుత్వ సంస్థలు నాలుగు నెలల్లోగా అంతర్గత ఆడిటింగ్ పూర్తి చేసుకుని, ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే మానవ వనరులు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు.అమెరికన్లకే ఉద్యోగాలు అనే సిద్ధాంతాన్ని తమ ప్రభుత్వం ఆచరిస్తోందని, తక్కువ వేతనం కోసం లభించే విదేశీ ఉద్యోగి కోసం కష్టపడి పనిచేసే అమెరికన్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తాము సహించబోమని ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో విదేశీ వృత్తినిపుణులు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం పడదని తెలిపింది హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా).

ఇప్పటికే హెచ్1 బీ వీసాల జారీపై నిషేధం కొనసాగుతున్నందున పలు కంపెనీలు భారత్‌కు ఔట్ సోర్సింగ్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని హైసియా అధ్యక్షులు, ఇన్ఫోఫీర్స్ సీఈవో భరణి కుమార్ అన్నారు.భారతదేశంలోని లక్షల మంది ఐటీ నిపుణుల్లో 20 శాతం మందికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, ఐవోటీ వంటి డిజిటల్ టెక్నాలజీపై ఎక్కువ అవగాహన వుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వచ్చే మూడేళ్లలో ఇండియాలో కనీసం 32 లక్షల మందికి పైగా పైగా డిజిటిల్ టెక్నాలజీ నిపుణులు అవసరమని భరణి కుమార్ తెలిపారు.భారత ప్రభుత్వం ప్రైమ్ పేరుతో కొత్త టెక్నాలజీపై శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.

అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నాయని భరణి కుమార్ చెప్పారు.దీనిలో భాగంగా స్థానికులను ఉద్యోగాల్లో నియమించుకుని, పని మొత్తం భారత్ నుంచి నడిచేలా ఔట్ సోర్సింగ్ ఇస్తున్నాయని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube