అనసూయ హగ్ ఇచ్చేవరకు వదలని ఆది.! తర్వాత అనసూయ ఏముందో చూస్తే షాక్.!       2018-06-08   23:11:48  IST  Raghu V

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

-

స్క్రిప్ట్ రైటర్ నుంచి స్కిట్ మేకర్ దాకా ఎంతో ప్రజాదరణ పొందాడు ఆది. ప్రోగ్రాం టీఆర్సీలు కాపాడేందుకు అనేక స్టంట్స్ చేస్తున్నాడు. అదిగో అలాగే అనసూయ హగ్ ఇచ్చే వరకు వదల్లేదు. కావాలంటే ఇదిగో ఈ ప్రొమో మీరే చూడండి.

ఎప్పటిలాగే లేడీ గెటప్ తో ఉన్న కోఆర్టిస్టుతో ఓ సాంగేసుకుని ఎంట్రీ ఇచ్చాడు ఆది. ఆ తర్వాత అలిగాడు. కారణం ఏంటని జడ్జ్ నాగబాబు అడిగితే… జబర్దస్త్ కంటే ఢీ కార్యక్రమమమే బెటరని, అక్కడి బాగా పెర్ఫామ్ చేస్తే ప్రియమణి వచ్చి హగ్ ఇస్తుందని, ఇక్కడ ఎంత చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదంటూ కామెంట్స్ చేసాడు.

దాంతో యాంకర్ అనసూయ వెంటనే నో అంటూ స్పందించి ఇది జబర్దస్త్ ఇజ్జత్ కా సవాల్ అంటూ మొహమాటంగానే వచ్చి హైపర్ ఆదికి హగ్ ఇచ్చి మురిపించింది. అయితే తానేదో సరదాకి అంటే నిజంగానే అనసూయ వచ్చి కౌగిలించుకోవడంతో షాకయ్యాడు ఆది. ఇప్పుడు ఓకేగా అని అనసూయ అనగానే… స్కిట్ ఎంట్రీకి సరిపడే హగ్ ఇవ్వమంటే స్కిట్ మర్చిపోయేలా హగ్ ఇచ్చారు అంటూ పంచ్ వేశాడు హైపర్ ఆది. దాంతో… హా.. నాటీ అంటూ సిగ్గుపడి వెళ్లిపోయింది అనసూయ. ఆ తర్వాత కూడా ఆది తన సెటైర్ల జోరు చూపించాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.