సినిమాల్లో తేలిపోతున్న హైపర్ ఆది పంచులు.. అసలు కారణం ఇదే?

కమెడియన్ హైపర్ ఆది అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.జబర్దస్త్ లో పంచ్ లతో ఆది చేసిన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు.

 Hyper Adi Punchulu Floating In The Movies Is This The Real Reason Hyper Adi ,jab-TeluguStop.com

అయితే జబర్దస్త్ లో చేస్తున్న కమెడియన్లందరు బుల్లితెర మీద అంతగా సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు.చలాకీ చంటి, చమ్మక్ చంద్ర ఇలా చూస్తే జబర్దస్త్ లో చేసినంత కామెడీ వెండి తెర మీద పండించలేక పోతున్నారు.

అయితే హైపర్ ఆది విషయానికొస్తే డైలాగ్ డైలాగ్ కు వేస్తున్న పంచ్ జబర్దస్త్ లో పేలినంతగా సినిమాలలో పేలకపోవడం ప్రేక్షకులు అంతగా తీసుకోవడం లేదు.అయితే మంచి పాత్ర దొరికితే ప్రేక్షకులు ఆదరిస్తారని హైపర్ ఆది చెబుతున్నారు.

కాని హైపర్ ఆది సత్తా కనుక వెండితెర మీద రుజువైతే స్టార్ కమెడియన్ గా అయ్యే అవకాశాలు ఎక్కువ అని సినీవిమర్శకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.ఒకసారి జబర్దస్త్ లో పడ్డ ముద్ర వెండితెర మీద పడితే హైపర్ ఆది లైఫ్ మారిపోయి, అవకాశాలు వెల్లువలు రానున్నాయి.

గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు అడపా దడపా సినిమాల్లో కమెడియన్స్ గా కీలకపాత్ర పోషిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.అయితే హైపర్ ఆది తన స్టైల్ ని కొంచెం మార్చి వెండి తెరకు తగ్గట్టుగా రూపొందించుకుంటే ఇంకా చాలా సినిమాల్లో నటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube