మరోసారి వివాదంలో ఇరుకున్న హైపర్ ఆది.. ఏకంగా పోలీస్ కేసు?

బుల్లితెరలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్.ఈ షో గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.

 Hyper Adi Once Again Embroiled In Controversy-TeluguStop.com

ఇందులో ఎంతో మంది కమెడియన్స్ తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు.వెండితెరపై అవకాశాలు కూడా అందుకున్నారు.

ఈ షో ప్రారంభం సమయంలో మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కానీ ఈ షో మొత్తం ప్రేక్షకులను కించపరిచే డైలాగులతో రెచ్చగొడుతున్నారు.

 Hyper Adi Once Again Embroiled In Controversy-మరోసారి వివాదంలో ఇరుకున్న హైపర్ ఆది.. ఏకంగా పోలీస్ కేసు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో చాలావరకూ ఈ షో లో పాల్గొనే కమెడియన్స్ పలు కేసు లలో కూడా ఇరికారు.తాజాగా మరో కమెడియన్ హైపర్ ఆది కూడా మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు.

జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా నిలిచిన హైపర్ ఆది.వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా చేస్తున్నాడు.ఈయన జబర్దస్త్ లో తన పంచ్ లతో బాగా ఫేమస్ అయ్యాడు.

ఇక దీంతో ఈయన మరింత రెచ్చిపోతూ ఏ షోలో నైనా నోటికి వచ్చిన డైలాగులతో కించపరుస్తాడు.అవతలి వారు ఏమనుకుంటున్నారో అని కూడా పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు.

ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఉంటాడు.

Telugu Controversy, Hyper Adi, Jabardasth, Police Case-Movie

ఇక తాజాగా ఈయనపై ఫిర్యాదు చేయగా.ఈ నెల 13న ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో హైపర్ ఆది బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా మాట్లాడటంతో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ తో పాటు పలువురు సభ్యులు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు.ఆది పైనే కాకుండా స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్ పై కూడా ఫిర్యాదు చేశారు.

ఇక దీంతో ప్రస్తుతం దర్యాప్తు చేయగా.గతంలోనూ కూడా ఆది పై మానవ హక్కుల సంఘానికి సంబంధించిన విషయంలో ఫిర్యాదు చేశారు.

#Hyper Adi #Police Case #Controversy #Jabardasth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు