గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా నవ్విస్తున్న కార్యక్రమం ఏదైనా ఉంది అంటే టక్కున సమాధానం జబర్దస్త్ షో అని ఇట్టే చెప్పేస్తారు.జబర్దస్త్ షో మొదట్లో కేవలం జబర్దస్త్ గా మొదలు అవ్వగా కొద్ది రోజుల తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ గా కూడా 2 ప్రోగ్రాములు జరుగుతూ వస్తున్నాయి.
ఇకపోతే ఈ జబర్దస్త్ కార్యక్రమంలో ప్రేక్షకులు ఎక్కువగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్కిట్స్ ని చూడడానికి ఎంతగానో ఇష్టపడతారు.దానికి కారణం వారు వేసే కామెడీ డైలాగ్ పంచులు.
ఇక జబర్దస్త్ షోలో అందరికంటే ఎక్కువగా రెమన్యురేషన్ తీసుకునే విషయంలో హైపర్ ఆది ముందు ఉంటాడు.దీనికి కారణం అతడు స్కిట్ లో వేసే కామెడీ పంచులు.
దీంతోనే జబర్దస్త్ షో లో ఎవరికి లేనంత క్రేజ్ హైపర్ ఆది సొంతం.ఎప్పుడొచ్చావు కాదయ్యా పంచ్ పేలిందా లేదా అన్నట్టుగా దూసుకెళ్తున్నాడు హైపర్ ఆది.జబర్దస్త్ షో లోకి కాస్త లేటుగా వచ్చిన అందరికంటే ఎక్కువగా పేరును అనతికాలంలోనే తెచ్చుకున్నాడు.కేవలం జబర్దస్త్ షో లోనే కాకుండా మిగతా షోలలో కూడా హైపర్ ఆది అదరగొడుతున్నాడు.
అప్పుడప్పుడు వెండితెర పై కూడా కనిపిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్నాడు.ఈ మధ్యకాలంలో హైపర్ ఆది కు సంబంధించి కొన్ని వార్తలు యూట్యూబ్ లో కాస్త గాసిప్ గా మారడంతో గాసిప్ రాజాగా పేరు తెచ్చుకున్నాడు ఆది.ఇక అవన్నీ పక్కన పెడితే.చాలా స్కిట్స్ లో భాగంగా అనసూయ ఎన్నోసార్లు హైపర్ ఆదితో కలిసి నటించింది.
అందుకే కాబోలు అనసూయ హైపర్ ఆది కి చాలా స్పెషల్ అంటూ చాలా గాసిప్స్ కూడా వచ్చాయి.
ఇకపోతే తాజాగా ఇందుకు సంబంధించి అనసూయ స్పందించింది.
ఆది ని ఉద్దేశించి ఆయన చాలా టాలెంటెడ్ అని… మిగతా వాళ్లతో పోలిస్తే పంచ్ డైలాగులు బాగా రాసి వాటిని స్టేజి మీద బాగా డెలివరీ చేస్తాడు అని చెప్పింది.నిజానికి ఆది స్కిట్ లో చేయాలని తాను కూడా ఆసక్తికరంగా ఉంటానని చెప్పుకొచ్చింది అనసూయ.
హైపర్ ఆది స్కిట్ లో చేయడం అనేది పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని, అక్కడ ఏం జరగబోతోందో తనకు హైపర్ ఆది ముందుగానే అన్ని విషయాలు చెప్పేస్తాడు అని అనసూయ ఓ క్లారిటీ ఇచ్చేసింది.అనవసరంగా అనేక పనికిరాని విషయాలు బయట ఏవేవో చర్చించుకుంటున్నారని.
అలాంటివన్నీ ఒట్టి అబద్ధాలు పుకార్లే అని వాటినన్నిటిని కొట్టిపారేసింది యాంకర్ అనసూయ.