'హైపర్‌' పంచ్‌ లకు ఏం అయ్యింది? జబర్దస్త్‌ చేసిన కొత్త మార్పులు ఏంటో తెలుసా?

తెలుగు కామెడీ షోల్లో జబర్దస్త్‌ కు ప్రత్యేకమైన క్రేజ్‌.సుదీర్ఘ కాలంగా టాప్ కామెడీ షో గా దూసుకు పోతున్న జబర్దస్త్‌ ఈమద్య కాలంలో లైట్‌ గా డల్‌ అయినట్లుగా అనిపిస్తుంది.

 Hyper Adi And Jabardst Not Getting Good Resonance ,anasuya ,etv Jabardast ,hype-TeluguStop.com

నాగబాబు వెళ్లి పోయిన సమయంలో కూడా జబర్దస్త్‌ కు ఎలాంటి ఇబ్బంది కాలేదు.కాని అనూహ్యంగా ఈమద్య కాలంలో కాస్త జబర్దస్త్‌ జోరు తగ్గిందనే టాక్ వినిపిస్తుంది.

అది యూట్యూబ్‌ వ్యూస్‌ ను చూస్తున్నా కూడా అర్థం అవుతుంది.యూట్యూబ్‌ లో గతంలో హైపర్‌ ఆది స్కిట్ లకు 24 గంటల వ్యవధిలో మిలియన్ ల వ్యూస్‌ వచ్చేవి.

కాని ఇప్పుడు ఆయన స్కిట్‌ లకు లక్షల్లో వ్యూస్ రావడం గగనంగా మారింది.పెద్ద ఎత్తున ఆయన స్కిట్ లకు యూట్యూబ్‌ లో వ్యూస్‌ వచ్చేవి.

కాని ఇప్పుడు ఆయన స్కిట్ లు పేలడం లేదు.జబర్దస్త్‌ కామెడీ స్కిట్ లు మరీ రొటీన్ గా వస్తున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త వారిని తీసుకు రావడంతో పాటు లవ్‌ ట్రాక్ లను నడుపుతున్నారు.

కాని ఏది వర్కౌట్ కావడం లేదు.

ఇంతకు ముందు అయిదు టీమ్ లు ఉండేవి.

కాని ఇప్పుడు మాత్రం ఒకటి తగ్గించి నాలుగు మాత్రమే చేశారు.జబర్దస్త్‌ లో హైపర్‌ ఆది టీమ్‌ తో పాటు మరో మూడు మాత్రమే ఉన్నాయి.

ఈ టీమ్ ల సంఖ్య తగ్గించడంతోనే అర్థం అవుతుంది.జబర్దస్త్‌ పరిస్థితి ఏంటీ అనేది.

అందుకే మరింత కంటెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.గతంలో ఒక్కో స్కిట్‌ ను పది నిమిషాలు ఉండేవి.

కాని ఇప్పుడు మాత్రం జబర్దస్త్‌ ఒక్కో స్కిట్ కేవలం 8 నిమిషాలే ఉంటుంది.జబర్దస్త్‌ లో ప్రస్తుతం ఎమాన్యూల్‌ మరియు వర్షల మద్య జోడీ కి సంబంధించిన షాట్స్ కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

అంతకు మించి జబర్దస్త్‌ లో ఏది వర్కౌట్ అవ్వడం లేదు.ఇంతకు ముందు గంటన్నర పాటు జబర్దస్త్‌ షో ఉండేది.

కాని ఇప్పుడు మాత్రం గంటకే కుదించారు.ముందు ముందు ఎలాంటి మార్పులు చూడాల్సి వస్తుందో అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube