వర్ష వెనుక తిరిగి ఇమ్మాన్యుయేల్ కు అలాంటి గతి.. ఆది కామెంట్స్ వైరల్?

ప్రతి వారం సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకుంటూ హైపర్ ఆది ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్కిట్లు చేస్తున్నారు.తాజాగా ఈ నెల 22వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో ఒకవైపు వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రసారం కాగా మరోవైపు ఇమ్మాన్యుయేల్ ఒంటరిగా ఎంట్రీ ఇస్తారు.

 Hyper Aadi Shocking Comments About Varsha Immanuel Love Track Marriage, Hyper Aa-TeluguStop.com

జబర్దస్త్ కమెడియన్ ఇతను వర్ష వెనుక తిరిగే ఇమ్మాన్యుయేల్ కదా అని అడుగుతాడు.

హైపర్ ఆది వెంటనే వర్ష వెనుక తిరిగే ఇప్పుడు టీ టీ అంటూ తిరుగుతున్నాడని పంచ్ వేస్తారు.

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ను వర్ష డీప్ గా లవ్ చేసింది కదా అని అడగగా ఇతను బినామీ అని అసలు సునామీ ఎవరో తెలియాల్సి ఉందని ఆది చెబుతాడు.వర్ష ఇమ్మాన్యుయేల్ ను ఇమిటేట్ చేస్తూ మరో జోడీ స్కిట్ చేయగా ఆ స్కిట్ ను చూసి జడ్జి రోజా, యాంకర్ అనసూయ పడీపడీ నవ్వడం గమనార్హం.

హైపర్ ఆది పరోక్షంగా ఇమ్మాన్యుయేల్ వర్ష మధ్య ఏమీ లేదని చెప్పారు.సుధీర్ రష్మీ తర్వాత ఆ స్థాయి పాపులారిటీని సంపాదించుకుని వర్ష ఇమ్మాన్యుయేల్ కూడా తమ స్కిట్ల ద్వారా, షోలలో ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్ ల ద్వారా మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నారు.వర్ష వైట్ కలర్ లో ఉంటే ఇమ్మాన్యుయేల్ బ్లాక్ కలర్ లో ఉండటంతో ఈ జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లి ఈవెంట్ కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం.అయితే వర్ష మాత్రం పలు సందర్భాల్లో ఇమ్మాన్యుయేల్ ను నిజంగానే లవ్ చేస్తున్నారేమో అనే విధంగా ప్రవర్తించారు.ఇమ్మాన్యుయేల్ కూడా పలు సందర్భాల్లో వర్షపై ప్రేమను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube