సుడిగాలి సుధీర్ రష్మీ జోడీపై పంచులు.. వెళ్లిన తర్వాత కూడా బాగా వాడేస్తున్నారుగా!

తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుదీర్, రష్మీ జోడికి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.ఈ జోడి కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి కూడా మనందరికీ తెలిసిందే.

 Hyper Aadi Satires On Sudigali Sudheer On Rashmi In Sridevi Drama Company , Hype-TeluguStop.com

ఆన్ స్క్రీన్ లో స్క్రిప్ట్ ప్రకారం ఈ జంట నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.కానీ ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ ఒకటైతే చూడాలని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే వీరిద్దరిపై ఎన్నో రకాల ఈవెంట్లు చేసినప్పటికీ, వారిపై ఇంకా మరిన్ని ఈవెంట్ లు చేసినా కూడా అభిమానులకు బోరింగ్ గా అనిపించదు.

ఆ ఎపిసోడ్ లను రిపీటెడ్ గా మళ్లీ చూస్తూనే ఉంటారు.

ఈ మధ్యకాలంలో సుధీర్ రష్మీ పెద్దగా కనిపించడం లేదు.సుడిగాలి సుదీర్ స్టార్ మాకు వెళ్లిపోగా రష్మీ మల్లెమాల టీమ్ లోనే ఉంది.

ఇప్పుడు వీరిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది అని అనుకున్నప్పటికీ రష్మీ కూడా స్టార్ మలోకి జంప్ అయ్యేటట్టు కనిపిస్తోంది. కాగా సుధీర్ వెళ్లిపోయినప్పటి నుంచి హైపర్ ఆది ప్రతిసారి బాబు అంటూ రష్మిని ఏడిపిస్తూనే ఉన్నాడు.

సుధీర్ వెళ్లిపోయిన కూడా మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు అతని పేరునే జపం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇక ఇప్పటికే వీరిద్దరి పెళ్లి నిశ్చితార్థం అంటూ ఇప్పటికే ఎన్నో ఈవెంట్లను చేయగా వారు కూడా స్క్రిప్ట్ ప్రకారం అనుకోకుండా నిజంగానే వారి మధ్యలో లవ్ ఉందా అన్న విధంగా జీవించేశారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది మరొకసారి రెచ్చిపోయాడు.సుధీర్,రష్మీ ఉద్దేశిస్తూ వరుసగా కౌంటర్లు వేశాడు.

ప్రేమ కావాలి హీరోయిన్ ఇషా చావ్లా కి అచ్చం సుధీర్ కి రష్మీ ఎలా అయితే ప్రపోజ్ చేసిందో అలాగే డైలాగులు కొడుతూ గిఫ్ట్ లు ఇస్తూ ప్రపోజ్ చేస్తూ ఇన్ డైరెక్టుగా రష్మీ పై కౌంటర్లు వేశాడు.ఈ తొమ్మిది ఏళ్ల బంధానికి ప్రతికగా 9 గిఫ్ట్ లు స్కిట్ మీద కౌంటర్లు వేశాడు.

కరెక్ట్ గా తొమ్మిదేళ్లు ఉంటే మీకు నిశ్చితార్థం పెళ్లి అంటూ ఇంకా 90 గిఫ్ట్ లు వచ్చేవి అంటూ వారిద్దరిపై సెటైర్లు వేశాడు.ఇక రష్మీ కూడా ఏమీ మాట్లాడకుండా హైపర్ ఆది పంచులకు సిగ్గుతో తలదించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube