విష్ణు ప్రియ ముక్కు పై పంచులు పేల్చిన హైపర్ ఆది.... దాంతో...

ప్రతి గురువారం ప్రముఖ టైన్మెంట్ ఛానల్ అయిన ఈ టీవీలో ప్రసారమయ్యే “జబర్దస్త్ కామెడీ షో” సినీ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా షో నిర్వాహకులు వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేశారు.

 Hyper Aadi Satires On Anchor Vishnu Priya News In Jabardasth Skit-TeluguStop.com

అయితే ఇందులో హైపర్ ఆది యాంకర్ విష్ణు ప్రియపై పేల్చేటువంటి పంచులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా హైపర్ ఆది టాలీవుడ్ ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియతో కలిసి మిరపకాయ్ చిత్రంలోని “చిలక” సాంగ్ కి స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చాడు.

 Hyper Aadi Satires On Anchor Vishnu Priya News In Jabardasth Skit-విష్ణు ప్రియ ముక్కు పై పంచులు పేల్చిన హైపర్ ఆది…. దాంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో విష్ణు ప్రియా హైపర్ ఆది ని పెళ్లయిన కొత్తలో చాలా రొమాంటిక్ గా ఉండేవాడని ఈ మధ్య ఎక్కువగా చిరాకు పడుతున్నాడని చెబుతుంది.దీంతో హైపర్ ఆది ఏకంగా ఏంటి రొమాన్స్ ముందుకెళ్ళి ముద్దు పెడదామంటే ముక్కు అడ్డొస్తుందని, ఇంకా ఏదైనా చేద్దాం అంటే కెమెరాలు అడ్డు వస్తున్నాయంటూ పంచులు పేల్చాడు.

అంతేకాకుండా ఏదైనా మొక్కు ఉందా.? ముక్కు ను అలా పెంచేస్తున్నావంటూ సెటైరికల్ పంచులు పేల్చాడు.ఆ తర్వాత విష్ణు ప్రియా రొమాంటిక్ గా బయట చల్ల గాలి, లోపల పిల్ల గాలి అంటూ డైలాగ్ చెబుతుండగా హైపర్ ఆది ఏకంగా ఈ గాలి, అవన్నీ ఆ గాలోడే అంటూ పరోక్షంగా సుధీర్ పై సెటైర్ వేశాడు.ఇక ఈ స్కిట్ కి తెలుగు హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అతిథిగా వచ్చి సరదాగా అందర్నీ నవ్వించాడు.

చివర్లో క్యాలీ ఫ్లవర్ చిత్రం గురించి డైలాగ్ చెబుతూ బాగానే ఆకట్టుకున్నాడు.

ఇక చివర్లో అదిరే అభి, రాకెట్ రాఘవ, చలాకి చంటి, వెంకీ తదితరులు తమ సీట్లతో బాగానే అలరించారు.

అయితే మొత్తానికి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన క్యాలీ ఫ్లవర్ చిత్రంలోని డైలాగ్స్ చెప్పడం ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది.మరి ఈ ఎపిసోడ్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే వచ్చే గురువారం వరకు ఆగాల్సిందే.

#Jabardasth Skit #HyperAadi #Anchor #Hyper Aadi #Comedian

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు