యాంకర్ రష్మీ గౌనుపై హైపర్ ఆది సెటైర్లు.. రెచ్చిపోయి మరీ పంచులు?

బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షో లు ప్రసారమవుతున్నాయి.చాలావరకు ప్రేక్షకులు కూడా వెండితెర కంటే బుల్లితెర పైనే బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

 Hyper Aadi Satires On Anchor Rashmi Dress Viral Details,  Anchor Rashmi, Hyper A-TeluguStop.com

స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలుస్తున్న పలు ఎంటర్టైన్మెంట్ షో లు మంచి ఆదరణతో దూసుకుపోతున్నాయి.అందులో పాల్గొనే కంటెస్టెంట్ లు, ఆర్టిస్టులు మాత్రం తమ పర్ఫార్మెన్స్ లతో బాగా రెచ్చిపోతూ సందడి చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమౌతున్న ఎంటర్టైన్మెంట్ షోలలో, కామెడీ షో లలో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో అలరించే కమెడియన్స్ లలో హైపర్ ఆది మొదటి స్థానంలో ఉన్నాడు.ఈయన పంచుల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఎందుకంటే తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా నిలిచాడు.

ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తూ బాగా పంచులు వేస్తాడు.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తొలిసారిగా వెండితెరకు పరిచయమయ్యాడు హైపర్ ఆది.ఇందులో అభి టీమ్ లో చేరి తర్వాత తనే ఒక టీం లీడర్ గా మారాడు.వెండితెరపై కూడా సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

కేవలం జబర్దస్త్ లోనే కాకుండా మల్లెమాల ప్రొడక్షన్ కు సంబంధించిన పలు షో లలో కూడా చేస్తున్నాడు.మధ్య మధ్యలో పలు ఈవెంట్లలో కూడా బాగా సందడి చేస్తూ ఉంటాడు.ఇక తను విసిరే డైలాగులు మాత్రం బాగా హైలెట్ గా ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు ఆయన చేసే స్కిట్లు వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి.

ఇక జబర్దస్త్ షో లో మాత్రం బాగా రెచ్చిపోతున్నాడు.యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్ లపై బాగా ట్రోలింగ్స్, సెటైర్ వేస్తుంటాడు.

ఇక మధ్య మధ్యలో పలువురు సెలబ్రెటీలను తీసుకొచ్చి సడన్ సర్ప్రైస్ లు ఇస్తుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రష్మీ పై మరోసారి సెటైర్ వేసాడు.

ప్రస్తుతం బుల్లితెరపై.త్వరలో రానున్న కొత్త సంవత్సరం సందర్భంగా పలు షో లు పలు ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు.దీంతో మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీ లో ఈ ఏడాదికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ‘ పెళ్ళాం వద్దు.పార్టీ ముద్దు’ అనే షోను ప్రసారం చేయనున్నారు.

దీంతో ఈ షో కు సంబంధించిన ప్రోమో లు కూడా విడుదలవుతున్నాయి.అందులో చీఫ్ గెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చాడు.

ఇక ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం పాల్గొన్నారు.ఇక అందులో యాంకర్ రష్మీ పై హైపర్ ఆది మరోసారి సెటైర్ వేశాడు.

ఇందులో రష్మీ లాంగ్ లెన్త్ గౌను వేసుకుని దర్శనమిచ్చింది.

ముందు వచ్చి నా డ్రెస్ సెట్ చేయండి మీరు అని అనటంతో.హైపర్ ఆది వెంటనే రియాక్ట్ అవుతూ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు టెంట్ ఎగిరిపోయింది అన్నారు.ఇక్కడ ఉందా? అంటూ రెచ్చిపోయి పంచులు వేసాడు.వెంటనే అక్కడున్న కమెడియన్స్ తెగ నవ్వుకున్నారు.ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Hyper Aadi Sensational Comments On Anchor Rashmi Dress

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube