వర్ష పరువు తీసిన హైపర్ ఆది.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది ఏ షోలో పాల్గొన్నా, ఏ ఈవెంట్ లో పాల్గొన్నా స్పాంటేనియస్ పంచ్ లతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తారనే సంగతి తెలిసిందే.అయితే శృతి మించే పంచ్ లు కొన్నిసార్లు నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పించేలా ఉంటాయి.

 Hyper Aadi Punches On Varsha In Sridevi Drama Company Show-TeluguStop.com

ఈటీవీ గత కొన్ని వారాల నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో ఒక షోను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

మొదట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా షో నిర్వాహకులు ఈ షోకు యంగ్, మిడిల్ రేంజ్ హీరోలను ఇన్వైట్ చేస్తూ షోపై ఆసక్తిని పెంచుతున్నారు.

 Hyper Aadi Punches On Varsha In Sridevi Drama Company Show-వర్ష పరువు తీసిన హైపర్ ఆది.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల కాగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వచ్చిన వర్షపై పంచ్ లు వేశారు.హైపర్ ఆది వర్షని బాగున్నారా అని అడగగా వర్ష “నేను చాలా బాగున్నానండీ.

ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి” అని చెబుతారు.

హైపర్ ఆది పనిలో పనిగా కింద కామెంట్లు కూడా చూసుకోకపోయారా అని ఆది వర్షకు చెబుతాడు.వర్ష అమాయకంగా అందులో ఏం అడుగుతున్నారు అని ఆదిని ప్రశ్నించగా కొత్తగా వచ్చిన లేడీ గెటప్ ఎవరు చాలా బాగుంది అని అడుగుతున్నారని ఆది చెబుతాడు.ఆ తరువాత మీరు చెప్పలేదా అని వర్ష ఆదితో అనగా చెప్పాలనే అనుకున్నాను కానీ నాకు తెలీదు కదా అంటూ వర్ష పరువు తీసేలా ఆది పంచ్ లు వేశారు.

ఆ తరువాత వర్ష మా ఊరు చూపిస్తా అంటూ రాజమండ్రి బ్రిడ్జ్ ను చూపించి ఈ బ్రిడ్జ్ కు 170 గేట్లు ఉంటాయని ఆదికి చెబుతారు.ఆది రామ్ ప్రసాద్ తో వర్షను ఆ స్టూడియో గేట్ల దగ్గర ఆపేసి ఉంటే ఈ గేట్ల గురించి వినాల్సిన పరిస్థితి మనకు వచ్చేది కాదని చెబుతాడు.

ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం1కు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

#Ram Prasad #Punches Varsha #Rajahmundry #Varsha #Hyper Aadi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు