సుధీర్ పరువు తీసేసిన హైపర్ ఆది.. ఏం జరిగిందంటే..?

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కలిసి చేసే స్కిట్లు కానీ ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్ లు కానీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.కొన్నిసార్లు హైపర్ ఆది సుధీర్ పై వేసే పంచ్ లు శృతి మించుతాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేసినా కడుపుబ్బా నవ్వించడం కోసమే చేసే ప్రయత్నం కాబట్టి సుధీర్ ఫ్యాన్స్ కూడా ఆ పంచ్ లను ఎంజాయ్ చేస్తారు.

 Hyper Aadi Punches On Sudigali Sudheer In Jabardasth Show, Sudigali Sudheer, Hy-TeluguStop.com

అయితే తాజాగా జబర్దస్త్ షో ప్రోమో విడుదల కాగా హైపర్ ఆది స్కిట్ లో సుడిగాలి సుధీర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.ఎఫ్ 2 మూవీలో రెచ్చిపోదాం బ్రదర్ పాటతో స్కిట్ స్టార్ట్ కాగా హైపర్ ఆది “కలిసొచ్చాం ఆలోచిస్తావ్ ఏంటన్నా.?” అని సుధీర్ ను అడగగా సుధీర్ బుధవారం ప్రదీప్ ఏసుకుంటున్నాడు.శుక్రవారం గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వేసుకుంటున్నాడని గురువారం అయినా ఖాళీగా ఉందామని అనుకుంటే నువ్వు పిలిచి ఏసుకుంటున్నావని అంటాడు.

హైపర్ ఆది వెంటనే ” ఈ మూడు రోజులు నేను ఏసుకునేది చెప్పావు కానీ మిగతా నాలుగు రోజులు” అంటూ పంచ్ వేసి సుధీర్ పరువు తీసేశాడు.ఆ తరువాత నీకంటూ సిద్ధాంతాలు ఉన్నాయా.? అని ఆది సుధీర్ ను అడగగా మనకు పెద్దగా సిద్ధాంతాలు ఉండవని యుద్ధం ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పోయే వరకు పోరాడాలని అంటారు.ఆది వాళ్లింటికి పోయే వరకా.? వాళ్లే పోయే వరకా.? అని మళ్లీ ఆది సుధీర్ పరువు తీసేశాడు.

ఆ తరువాత ఈ గెటప్ లో నేను జేమ్స్ బాండ్ లా లేను అని ఆదిని సుధీర్ అడగగా ఆది నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా అబ్రకదబ్రలానే కనిపిస్తావని చెబుతాడు.ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 9 :30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube