రష్మీ రెచ్చగొడితే సుధీర్ అలా చేస్తాడన్న ఆది.. ఏమైందంటే..?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో పాటు డ్యాన్స్ షోలలో ఒకటైన ఢీ షో సక్సెస్ కావడానికి ఒక విధంగా రష్మీ సుధీర్ జోడీ కారణమనే సంగతి తెలిసిందే.ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మీ సుధీర్ జోడీ ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్ లతో పాటు రష్మీ సుధీర్ మధ్య కెమిస్ట్రీ వల్ల ఆయా షోలు హిట్ అవుతున్నాయి.

 Hyper Aadi Punches On Rashmi Sudheer In Extra Jabardasth Show, Extra Jabardast S-TeluguStop.com

నిజమైన ప్రేమికులే అనేంతలా రష్మీ సుధీర్ రియాలిటీ షోలలో జీవిస్తూ ఉంటారు.

రష్మీ గతంలో వేరే హీరోలతో కలిసి నటించిన సమయంలో సుధీర్ ఫ్యాన్స్ లో కొందరు రష్మీ సుధీర్ తో తప్ప మరెవరితో నటించకూడదని కామెంట్లు పెట్టారు.

అయితే తాజాగా హైపర్ ఆది ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు హాజరు కాగా రష్మీ, సుధీర్ పై భలే పంచ్ లు వేశారు.కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు పాటతో హైపర్ ఆది, మనో ఎక్స్ట్రా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆది మనోతో సాంగ్ బాగుందన్నా.! మీరు కుర్రాడు అంటేనే అదోలా ఉంది అని చెబుతాడు.

ఎక్కడ దొరికాను ఈ స్టెప్స్ లోనా.? అని అడగగా ఇందాక కారవాన్ స్టెప్స్ ఎక్కే సమయంలోనే దొరికారు అని ఆది పంచ్ వేస్తారు.పొట్ట తగ్గిస్తే పనవుతుందంటావా.? అని అడగగా మీ పొట్ట పెట్రోల్ రేట్లలా పెరగడమే తప్ప తగ్గడం లేదని అంటాడు.ఆ తరువాత ఆది ” సుత్తికొట్టే సుధీర్ రెచ్చగొట్టే రష్మీ” అనే టీమ్ పెడితే బాగుంటుందని అన్నారు.ఆ పంచ్ తో షాక్ అవ్వడం రష్మీ వంతయింది.

రష్మీ రెచ్చగొడితే సుధీర్ సుత్తి కొడతాడంటూ ఆది పంచ్ వేస్తారు.హైపర్ ఆది జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.వచ్చే శుక్రవారం రాత్రి 9 : 30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube