అనసూయ ప్రేమ కోసం హైపర్ ఆది పాట్లు.. ఏం జరిగిందంటే?  

hyper aadi punches on anasuya bharadwaj in jabardasth skit, jabardasth skit, hyper aadi ,love skit, anchor anasuya, etv, jabardasth show - Telugu Anchor Anasuya, Etv, Hyper Aadi, Jabardasth Show

బుల్లితెరపై ఎన్ని కామెడీ షోలు వచ్చినా జబర్దస్త్ షో ప్రత్యేకం.ఈ షో ప్రారంభమై ఏడు సంవత్సరాలు అయినా నేటికీ అదిరిపోయే టీఆర్పీ రేటింగులను సొంతం చేసుకోవడంతో పాటు ఎంతో మంది కమెడియన్లను ప్రేక్షకులకు ఈ షో పరిచయం అయ్యేలా చేసింది.

TeluguStop.com - Hyper Aadi Punches On Anasuya Bharadwaj In Jabardasth

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో మిగతా వాళ్లతో పోలిస్తే హైపర్ ఆది కామెడీ ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.హైపర్ ఆది వీడియోలకు యూట్యూబ్ లో సైతం మిలియన్లలో వ్యూస్ వస్తూ ఉంటాయి.

అనసూయతో కొన్ని స్కిట్లలో డ్యాన్సులు చేసిన హైపర్ ఆది అనసూయపై పంచులు వేస్తూ స్కిట్ ను రక్తి కట్టిస్తూ ఉంటారు.వచ్చే గురువారం రాత్రి ప్రసారం కాబోయే జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా హైపర్ ఆది అనసూయ ప్రేమ కోసం తాను పడిన పాట్లను చెప్పుకొచ్చారు.

TeluguStop.com - అనసూయ ప్రేమ కోసం హైపర్ ఆది పాట్లు.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

హైపర్ ఆది ప్రేమలో ఫెయిల్ అయిన వ్యక్తిలా చేతిలో బీర్ బాటిల్ తో కనిపిస్తూ ప్రేమనగర్ సినిమాలోని ఎవరికోసం పాటతో ఎంట్రీ ఇచ్చాడు.
అనసూయ లేచి వెళ్లిపోతుంటే హైపర్ ఆది అనసూయ ఎక్కడికి.? అని అంటాడు.అనసూయ నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోతానని అనగా క్యారవాన్ లోకి వెళ్లి కాజూ బిర్యానీ తినడానికి అని చెప్పొచ్చుగా.? అని ఆది కౌంటర్ వేస్తాడు.ఆ తర్వాత నాకు ఆకలి వేస్తుందని నీకు ఎలా తెలుసు.? అని అనసూయ అడగగా ఆకలేయపోతే అనసూయ అందరి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుందని ఆకలేస్తే తన ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇవ్వదని ఆది చెబుతాడు.

అన్నీ మరిచిపోయి కలిసి ఉందాం వచ్చెయ్ అని హైపర్ ఆది చెప్పగా అనసూయ నువ్వు మరిచిపోయినా నేను మాత్రం మరిచిపోను అని చెబుతుంది.

అనసూయ ఆది చాలా మారిపోయాడని చెప్పగా అనసూయనే తన విషయంలో మారిపోయిందంటూ ఆది కౌంటర్లు వేశాడు.హైపర్ ఆది సరదాగా అనసూయతో స్కిట్ లో వేసిన పంచులతో కూడిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Jabardasth Show #Hyper Aadi #Anchor Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyper Aadi Punches On Anasuya Bharadwaj In Jabardasth Related Telugu News,Photos/Pics,Images..