విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఆది షాకింగ్ కామెంట్స్.. అతని పేరు చెబుతూ?

బుల్లితెర యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియ బుల్లితెర షోలు చేస్తూనే సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.విష్ణుప్రియ నటించిన చెక్ మేట్ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

 Hyper Aadi Interesting Comments About Vishnupriya Love Track-TeluguStop.com

అయితే ప్రముఖ ఛానెళ్లలో ప్రసారమయ్యే ఈవెంట్లలో ఎప్పుడూ పాల్గొనని విష్ణుప్రియ తాజాగా జబర్దస్త్ షోలో సందడి చేయడం గమనార్హం.హైపర్ ఆది విష్ణుప్రియ గురించి, విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి వేసిన్ పంచ్ లు హైలెట్ అవుతున్నాయి.

హైపర్ ఆది ఈ మధ్య కాలంలో స్కిట్లలో ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్ తో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు.ఓ సిలకా అనే పాటతో హైపర్ ఆది, విష్ణుప్రియ ఎంట్రీ ఇవ్వగా ఆది నువ్వు చిరాకుచిరాకుగా చేస్తావ్ పెళ్లప్పుడు ఎంతో రొమాంటిక్ గా ఉండేవాడివని విష్ణుప్రియ అంటారు.

 Hyper Aadi Interesting Comments About Vishnupriya Love Track-విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఆది షాకింగ్ కామెంట్స్.. అతని పేరు చెబుతూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏంటే రొమాన్సు ముందుకెళ్లి ముద్దు పెట్టాలని అనుకుంటే ముక్కు అడ్డు వస్తుందని పోనీ కౌగించుకోవాలని అనుకుంటి నా పొట్ట అడ్డు వస్తుందని ఆది చెబుతాడు.

ముద్దు, హగ్ ను మించి ఏమైనా చేద్దామా అని అనుకుంటే మొత్తం కెమెరాలే అడ్డు వస్తున్నాయని ఆది చెబుతాడు.ఏమైనా మొక్కు ఉందా నీకు అని ఆది అడగగా ఏం లేదే అని విష్ణుప్రియ చెబుతుంది.మరి ముక్కు ఎందుకు అంత పెంచుతున్నావ్ అంటూ ఆది విష్ణుప్రియ పరువు తీసేస్తాడు.

బయట చల్లగాలి లోపల పిల్లగాలి అని విష్ణుప్రియ చెప్పగా ఈ గాలి అన్నీ ఆ గాలోడే అంటూ సుధీర్ గురించి ఆది కామెంట్లు చేశారు.

విష్ణుప్రియ, సుధీర్ కలిసి పోవే పోరా షో చేయడంతో వాళ్ల మధ్య ఏదో ఉందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఆ వార్తల గురించి లాగుతూ ఆదిప్ పంచ్ లు వేయడం గమనార్హం.ఆ తర్వాత హీరో సంపూర్ణేష్ బాబు క్ల్యాలీ ఫ్లవర్ మూవీ ప్రమోషన్స్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

ఆగష్టు 5వ తేదిన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

#Vishnupriya #Love Track #Sudheer #Jabardasth Show #Hyper Aadi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు